సినెర్‌ ఖాతాలో మయామి మాస్టర్స్‌ టైటిల్‌ | Jannik Sinner Tops Grigor Dimitrov For Miami Open Title | Sakshi
Sakshi News home page

సినెర్‌ ఖాతాలో మయామి మాస్టర్స్‌ టైటిల్‌

Published Tue, Apr 2 2024 8:45 AM | Last Updated on Tue, Apr 2 2024 8:45 AM

Jannik Sinner Tops Grigor Dimitrov For Miami Open Title - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, ఇటలీ టెన్నిస్‌ స్టార్‌ యానిక్‌ సినెర్‌ మూడో ప్రయత్నంలో మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫ్లోరిడాలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సినెర్‌ 6–3, 6–1తో దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై గెలిచాడు.

2021, 2023లలో రన్నరప్‌గా నిలిచిన సినెర్‌ ఈసారి మాత్రం టైటిల్‌ను వదల్లేదు. సినెర్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సినెర్‌ ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా నిలిచాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement