‘ఇది నాకు తొలి ఐపీఎల్‌ సీజన్‌లా లేదు’

It Doesnt Feel Like This Is My First Season, Abdul Samad - Sakshi

దుబాయ్‌:  ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడి ఈ  లీగ్‌లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ సామద్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే తన ఫోకస్‌ ఉందన్నాడు. ఇది తనకు ఐపీఎల్‌ అరంగేట్రమే అయినా తానేమీ తొలి ఐపీఎల్‌ సీజన్‌ ఆడుతున్నట్లు భావించడం లేదని,  తనకు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి ఎంతో సహకారం లభిస్తుందన్నాడు. తనపై ఎటువంటి ఒత్తిడి లేదని, కాకపోతే ఒక బాధ్యత మాత్రం ఉందన్నాడు. తన శాయశక్తులా రాణించడమే తన ముందున్న బాధ్యతగా సామద్‌ తెలిపాడు. జమ్మూ-కశ్మీర్‌ నుంచి ఐపీఎల్‌ ఆడుతున్న మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సామద్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌లోని సభ్యులంతా సానుకూల ధోరణితో ఉండటంతో తనకు కొత్తగా అనిపించడం లేదన్నాడు. (చదవండి: ‘అతనేమీ మ్యాచ్‌ విన్నర్‌ కాదు’)

కోచ్‌లతో పాటు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సహకారం కూడా మరువలేనిదన్నాడు. తమ జట్టులో అత్యుత్తమ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉండటం, తాను కూడా లెగ్‌ స్పిన్నర్‌ని కావడంతో చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం దొరికిందన్నాడు. మ్యాచ్‌ పరిస్థితిని బౌలింగ్‌ ఎలా చేయాలి అనే విషయంతో పాటు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో నిలకడగా బౌలింగ్‌ ఎలా వేయాలనేది రషీద్‌ను అడిగి తెలుసుకున్నానన్నాడు.ఢిల్లీతో మ్యాచ్‌లో 12 పరుగులతో అజేయంగా నిలిచిన సామద్‌.. అందులో ఒక సిక్స్‌ కూడా కొట్టాడు. నోర్త్‌జే వేసిన బౌలింగ్‌ సామద్‌ సిక్స్‌ కొట్టిన తీరు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన సామద్‌ 592 పరుగులు సాధించాడు. ఇక 12 టీ20ల్లో 252 పరుగులు చేశాడు. టీ20ల్లో సామద్‌ స్టైక్‌రేట్‌ 137గా ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top