IPL 2026 RR vs LSG Live updates: ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి.
రాణించిన జడేజా..
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్ దూబే(19), హెట్‌మైర్(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
19 ఓవర్లకు రాజస్తాన్ స్కోరెంతంటే?
19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్
రాజస్తాన్ రాయల్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్ హెట్‌మైర్.. మోహ్షిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్ స్కోర్: 78-5
రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్
20 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 62/4
రాజస్తాన్ మూడో వికెట్
రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 32/3
నిప్పులు చెరుగుతున్న షమీ
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్ పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో రాజస్తాన్ వరుస బంతుల్లో జైశ్వాల్(22), ధ్రువ్ జురెల్(0) పెవిలియన్‌కు చేరారు.
ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్‌లతో బరిలోకి దిగింది.
అవేష్ ఖాన్, సిద్దార్ధ్ స్ధానాల్లో దిగ్వేష్, మయాంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న నికోలస్ పూరన్‌కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్
లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్


