
ఐపీఎల్ 2026కు (IPL 2026) సంబంధించి బిగ్ అప్‌డేట్ తెలుస్తుంది. ఈ సీజన్ వేలం డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. బీసీసీఐతో చర్చించిన ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ తేదీలను సూచించారని తెలుస్తుంది. ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌దే తుది నిర్ణయంగా ఉంటుంది.
రిటెన్షన్‌కు ఇదే డెడ్‌లైన్..!
అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. విడుదల చేయబోయే ఆటగాళ్ల పేర్లను అంతకుముందే ఖరారు చేయాలి.
ఈసారి వేలం భారత్‌లోనే..?
గత రెండు సీజన్లలో (2023 దుబాయ్, 2024 జెడ్డా) విదేశాల్లో జరిగిన వేలం, ఈసారి భారత్‌లోనే జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్‌లో భారీ మార్పులు..?
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్తాన్ రాయల్స్ (RR) గత సీజన్‌లో అట్టడుగు స్థానాల్లో ముగించడంతో వచ్చే సీజన్‌కు ముందు భారీ మార్పులకు ఆస్కారముంటుంది.
సీఎస్‌కే.. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ వెటరన్లను వదిలించుకోవచ్చు. అశ్విన్ ఎలాగూ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి, అతనికి ఇస్తున్న రూ. 9.75 కోట్లను కూడా వేలంలో వాడుకోవచ్చు.
రాజస్తాన్ విషయానికొస్తే.. వేలానికి ముందే ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్ సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా విడుదల చేసే అవకాశముంది. ఇతర ఫ్రాంచైజీలు ఏవైనా సంజూపై ఆసక్తి కనబరిస్తే.. ట్రేడింగ్ జరగవచ్చు.
ఆర్‌ఆర్ యాజమాన్యం సంజూతో పాటు వనిందు హసరంగ, మహీష్ తీక్షణను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి విషయంలో కుమార సంగక్కర (కోచ్) కీలకపాత్ర పోషిస్తాడు.
వెంకటేష్ అయ్యర్‌పై వేటు
గత సీజన్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో రూ. 23.75 కోట్ల ధర దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ వదిలించుకోవచ్చు. గత సీజన్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు.
గ్రీన్‌కు భారీ ధర..?
ఈ సీజన్ వేలంలో ఆసీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్‌కు భారీ ధర దక్కే అవకాశం ఉంది. గత సీజన్‌లో గాయంతో మిస్ అయిన గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది.