
ఐపీఎల్-2025ను భారత క్రికెట్ బోర్డు వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో స్పష్టమైన తేదీని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.
దీంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి పయనం కానున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభమైన కూడా చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మిగిలిన టోర్నీని విదేశాలకు తరలించిన ఆశ్చర్యపోనక్కర్లలేదు. బీసీసీఐకు యూఏఈ మొదటి అప్షన్‌గా ఎల్లప్పుడూ ఉంటుంది.
కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా యూఏఈలోనే నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తుందా? లేదా భారత్‌లోనే కొనసాగుస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక సూచనలు చేశాడు.
ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి ఇంగ్లండ్‌ను మంచి ఎంపికగా బీసీసీఐ పరిగణించాలని వాన్ అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూకేలో నిర్వహిస్తే బాగుటుంది. మాకు చాలా స్టేడియాలు ఉన్నాయి.
అంతేకాకుండా భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ను పూర్తి చేసుకుని టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లోనే ఉండిపోవచ్చు. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే" అని ఎక్స్‌లో వాన్ రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
చదవండి: IPL 2025: ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన