Sakshi News home page

IPL 2024 Finals Venue: ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక ఖరారు.. అహ్మదాబాద్‌లో కాదు..!

Published Sun, Mar 24 2024 10:51 AM

IPL 2024 Final Match To Be Held In Chennai - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని వేదిగా నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లు అహ్మదాబాద్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక కాదని తేలిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్‌, ఓ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుందని తెలుస్తుంది. మరో ఎలిమినేటర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నట్లు సమాచారం.

ఫైనల్‌ మ్యాచ్‌ తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు​ మే 26న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఫైనల్‌ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోం గ్రౌండ్‌లోనే ఆరంభ మరియు ఫైనల్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇదే సంప్రదాయాన్ని ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ ఈ సీజన్‌కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్‌లోనే అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం కావడంతో ఇ​క్కడ ఫైనల్‌ జరిగితే బాగుంటుందని కొందరు పెద్దలు అభిప్రాయపడినప్పటికీ.. గవర్నింగ్‌ బాడీ అంతిమంగా చెన్నైనే ఫైనల్‌ చేసినట్లు సమాచారం​.

కాగా, ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ (మార్చి 24) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌, లక్నో జట్లు (జైపూర్‌) తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ (అహ్మదాబాద్‌) ఢీకొట్టనున్నాయి. 

Advertisement

What’s your opinion

Advertisement