ఆమిర్‌ను ట్రోల్‌ చేసిన టీమిండియా క్రికెటర్స్‌

IPl 2023: Rohit Sharma-Other Team India Cricketers Trolls Aamir Khan - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా ఇతర క్రికెటర్లు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ను ట్రోల్‌ చేయడం ఆసక్తి కలిగించింది. 2009లో రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌, ఆర్‌. మాధవన్‌, శర్మన్‌ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన త్రీ ఇడియట్స్‌(3 Idiots) సినిమా గుర్తుందిగా. భారతీయ విద్యావ్యవస్థపై సెటైర్లు, ర్యాంకుల పేర్లతో విద్యార్థులు సంఘర్షణకు గురవ్వడం లాంటివి చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇండియన్‌ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన 'త్రీ ఇడియట్స్‌' సినిమా అప్పట్లో ఒక సంచలనం.

2016లో ఆమిర్‌ ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 'త్రీ ఇడియట్స్‌'కు సీక్వెల్‌ ఉంటుందని.. రాజ్‌కుమార్‌ హిరానీ నాకు చిన్న హింట్‌ ఇచ్చారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆమిర్‌, మాధవన్‌, శర్మన్‌ జోషిలు కలిసి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తి రేపింది. త్రీ ఇడియట్స్‌కు సీక్వెల్‌ ఉంటుందని చెప్పడానికే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అనుకున్నారు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు.

కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తాము క్రికెట్‌ ఆడబోతున్నట్లు ఆమిర్‌ పేర్కొన్నాడు. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్ల ఆటతీరును తప్పుబడుతూ ట్రోల్‌ చేశారు. తాము క్రికెట్‌లోకి ఎంటర్‌ ఇస్తున్నామని.. ఎందుకంటే క్రికెటర్లు మా బిజినెస్‌(అడ్వర్టైజ్‌మెంట్‌)లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటూ ఆమిర్‌ పేర్కొన్నాడు. అయితే ఇదంతా కేవలం ఫన్నీ కోసమే.

మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌కు సంబంధించి ఒక ప్రమోషన్‌ వీడియోను షూట్‌ చేశాడు. డ్రీమ్‌ ఎలెవెన్‌, ఐపీఎల్‌ కోసం ఈ వీడియోను షూట్‌ చేశారు. మేం యాక్టింగ్‌లో బిజీగా ఉన్నప్పటికి క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం అని ఆమిర్‌, మాధవన్‌, శర్మన్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోనూ చూసిన టీమిండియా క్రికెటర్లు ఆమిర్‌ ఖాన్‌ను ఫన్నీగా ట్రోల్‌ చేశారు. రోహిత్‌ శర్మ స్పందిస్తూ.. ''సినిమాలో క్రికెట్‌ ఆడినంత మాత్రానా క్రికెటర్‌ అయిపోడు''.. ''ఒక హిట్‌ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్‌మ్యాన్‌లు అయిపోలేరు'' అంటూ ట్రోల్‌ చేశాడు. ''మాటలు చెప్పడం ఈజీ.. ఆడడం కష్టం.. ఎప్పుడు తెలుసుకుంటావు ఆమిర్‌ జీ'' అంటూ అశ్విన్‌ ఫన్నీ కామెంట్‌ చేశాడు. ఇక హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. ''ఒక్క బౌన్సర్‌తో మీ ముగ్గురు గ్రౌండ్‌లోనే కుప్పకూలడం ఖాయం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. 

చదవండి: ఒక్కడికి సీరియస్‌నెస్‌ లేదు; థర్డ్‌ అంపైర్‌కు మెంటల్‌ ఎక్కించారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top