IPL 2023: గుజరాత్‌ విజయాల్లో ఆ దేశ బౌలర్లదే కీలకపాత్ర

IPL 2023: Afghan Bowlers Rashid Khan, Noor Ahmed Playing Key Role In Gujarat Wins - Sakshi

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో (రన్‌రేట్‌ 0.580) పాయింట్ల పట్టికలో చెన్నై (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 0.662) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌ విజయాల్లో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా మినహాయించి అందరూ తలో చేయి వేస్తున్నారు.

బౌలింగ్‌లో షమీ, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌.. బ్యాటింగ్‌లో సాహా, గిల్‌, విజయ్‌ శంకర్‌, మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌.. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కో మ్యాచ్‌లో రాణించి గుజరాత్‌ను గెలిపించారు. ముఖ్యంగా హార్ధిక్‌ సేన సాధించిన మెజార్టీ విజయాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లు రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ కీలకపాత్ర పోషించారు. వీరు ఆడిన ప్రతి మ్యాచ్‌లో వికెట్లు సాధించి, కెప్టెన్‌ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. 

రషీద్‌ ఖాన్‌ విషయానికొస్తే.. ఈ 15 కోట్ల ఆటగాడు (ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రషీద్‌ ఖాన్‌ రెమ్యూనరేషన్‌) ప్రస్తుత సీజన్‌లో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌ నుంచి ప్రతి మ్యాచ్‌లో ఒకటి అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 

  • సీఎస్‌కేపై 2/26, 10 నాటౌట్‌ (3) (గుజరాత్‌ గెలుపు) (మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌)
  • ఢిల్లీపై 3/31 (గుజరాత్‌ గెలుపు)
  • కేకేఆర్‌పై 3/37 (గుజరాత్‌ ఓటమి)
  • పంజాబ్‌పై 1/26 (గుజరాత్‌ గెలుపు)
  • రాజస్థాన్‌పై 2/46 (గుజరాత్‌ ఓటమి)
  • లక్నోపై 1/33 (గుజరాత్‌ గెలుపు)
  • ముంబైపై 2/27 (గుజరాత్‌ గెలుపు)

నూర్‌ అహ్మద్‌ విషయానికొస్తే.. ఈ 18 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ ఈ ఏడాది వేలంలో 30 లక్షలకు సొంతం చేసుకుంది. లెఫ్ట్‌ ఆర్మ చైనామెన్‌ బౌలర్‌ అయిన నూర్‌.. ప్రస్తుత సీజన్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ బౌలర్‌ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్‌) పడగొట్టాడు. 

  • రాజస్థాన్‌పై 1/29 (గుజరాత్‌ ఓటమి)
  • లక్నోపై 2/18 (గుజరాత్‌ గెలుపు)
  • ముంబైపై 3/37 (గుజరాత్‌ గెలుపు)
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top