Breadcrumb
Live Updates
IPL 2022: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
దినేశ్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఘన విజయం
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 23 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో షాబాజ్ అహ్మద్(45) నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇక కార్తిక్ మరో నిదహాస్ ఇన్నింగ్స్‌ను తలపించాడు. ఆరంభం నుంచి దూకుడైన ఆటతీరుతో మెప్పించిన కార్తిక్ చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, చహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ తీశాడు.
షాబాజ్ అహ్మద్(45) ఔట్.. ఐదో వికెట్ డౌన్
నిలకడగా ఆడుతున్న షాబాజ్ అహ్మద్(45) బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 13 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉంది.
15 ఓవర్లలో ఆర్సీబీ 125/5
15 ఓవర్లలో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 31, షాబాజ్ అహ్మద్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 30 బంతుల్లో 45 పరుగులు కావాలి.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
ఆర్సీబీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మొదట కోహ్లి శాంసన్ మెరుపు ఫీల్డింగ్‌కు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే డేవిడ్ విల్లే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డుప్లెసిస్ చహల్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
టార్గెట్ 170.. 4 ఓవర్లలో ఆర్సీబీ 33/0
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. డుప్లెసిస్ 18, అనూజ్ రావత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లలో రాజస్తాన్ 169.. ఆర్సీబీ టార్గెట్ 170
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్, 6 సిక్సర్లు), హెట్‌మైర్(31 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అంతకముందు పడిక్కల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, హసరంగా, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
సంజూ శాంసన్(8) ఔట్.. మూడో వికెట్ డౌన్
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ శాంసన్ హసరంగా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. బట్లర్ 34, హెట్‌మైర్ 9 పరుగులతో ఆడుతన్నాడు
పడిక్కల్(38) ఔట్.. రాజస్తాన్ రెండో వికెట్ డౌన్
38 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బట్లర్ 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
దాటిగా ఆడుతున్న రాజస్తాన్ రాయల్స్.. 9 ఓవర్లలో స్కోరెంతంటే
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. పడిక్కల్ 36, బట్లర్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ స్కోరు 31/1
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. పడిక్క్ 18, బట్లర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
యశస్వి జైశ్వాల్(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
యశస్వి జైశ్వాల్(4) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో జైశ్వాల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది.
ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్ 10 మ్యాచ్‌లలో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
Related News By Category
Related News By Tags
-
IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఖరీదైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఖరీదైన జట్టుగా మాత్రమే గాక క్యాచ్ రిచ్ లీగ్‌లో అత్యధిక టైటిల్స్ కొట్టిన జట్టుగానూ ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఇ...
-
అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!
శార్దూల్ ఠాకూర్.. ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే శార్దూల్ ఒక ఫాస్ట్ బౌలర్ కాదు.. స్వింగ్ బౌలర్ అంతకన్నా కాదు. అతడి బౌలింగ్‌లోనూ పెద్దగా వైవిధ్యత కన...
-
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్లబంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే తాజాగా బాల్ టాంపర...
-
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికె...
-
‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 సీజన్లలో తొలి మ్యాచ్‌లో తమను ఓటములే పలకరించాయని, కానీ 14 ఏండ్ల...


