IPL 2022: ఢిల్లీపై ముంబై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ

ఐపీఎల్-2022 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ముంబై బ్యాటర్లలో కిషన్(48),బ్రేవిస్(37), డేవిడ్ (34) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ సాధించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పావెల్(43), పంత్(39) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, రమణదీప్ సింగ్ రెండు, సామ్స్, మయాంక్ మార్కండే తలా వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
145 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన డేవిడ్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
16 ఓవర్లకు ముంబై స్కోర్: 114/3
16 ఓవర్లు ముగిసే సరికి ముంబై మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(13), టిమ్ డేవిడ్(11) పరుగులతో ఉన్నారు. ముంబై విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు కావాలి.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
95 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన బ్రేవిస్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 33 బంతుల్లో 65 పరుగులు కావాలి.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. కిషన్ ఔట్
72 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 48 పరుగుల చేసిన కిషన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 78/2
10 ఓవర్లకు ముంబై స్కోర్: 62/1
10 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో బ్రెవిస్(22), కిషన్(37) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు ముంబై స్కోర్: 40/1
8 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో బ్రెవిస్(9), కిషన్(28) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
25 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. నోర్జే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐదు ఓవర్లకు ముంబై స్కోర్: 25/0
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో కిషన్(22), రోహిత్ శర్మ(2) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు ముంబై స్కోర్: 15/0
2 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో కిషన్(15), రోహిత్ శర్మ ఉన్నారు.
రాణించిన పావెల్.. ముంబై టార్గెట్ 160 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పావెల్(43), పంత్(39) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, రమణదీప్ సింగ్ రెండు, సామ్స్, మయాంక్ మార్కండే తలా వికెట్ సాధించారు.
19 ఓవర్లరు ఢిల్లీ స్కోర్: 148/6
19 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(13), శార్ధూల్ ఠాకూర్(2) పరుగులతో ఉన్నారు.
15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 106/4
15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. క్రీజులో పావెల్(34),పంత్(24) పరుగులతో ఉన్నారు.
12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 84/4
12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 84/4, క్రీజులో పంత్(21), పావెల్(21) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
50 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 48/3
8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(9), సర్ఫరాజ్ ఖాన్(13) పరుగులతో ఉన్నారు
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
31 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటిల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన పృథ్వీ షా.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
22 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటిల్స్ రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ డకౌటయ్యాడు. క్రీజులో పంత్,పృథ్వీ షా ఉన్నారు
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
21 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. సామ్స్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 12/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్(5), పృథ్వీ షా(7) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2022లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో కీలక పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
మరిన్ని వార్తలు