Breadcrumb
Live Updates
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
ఉత్కంఠ భరిత పోరులో కేకేఆర్ ఓటమి
అఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై లక్నో సూపర్ జయింట్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టోయినిష్ వేసిన అఖరి ఓవర్లో 21 పరుగులు కావల్సిన నేపథ్యంలో తొలి నాలుగు బంతులకు రింకూ సింగ్ 18 పరగులు రాబట్టాడు.
అయితే ఐదో బంతికి రింకూ ఔట్ కావడంతో మ్యాచ్ లక్నో వైపు మలుపు తిరిగింది. అఖరి బంతికి మూడు పరుగులు అవసరమవ్వగా.. ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (50),నితీష్ రాణా(42),రింకూ సింగ్(40) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో మోహ్షిన్ ఖాన్, స్టోయినిష్ చెరో మూడు వికెట్లు, గౌతమ్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. డికాక్ కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు.అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక కెప్టెన్ రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు సాధించాడు.
ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్..
150 పరుగుల వద్ద కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రస్సెల్.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి 12 బంతుల్లో 38 పరుగులు కావాలి.
ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్
142 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన బిల్లింగ్స్..బిష్టోయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 144/5
నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్
131 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 134/4
11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 115/3
11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(39), బిల్లింగ్స్(25) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
65 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన నితీష్ రాణా.. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు కేకేఆర్ స్కోర్: 75/3
6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 60/2
6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(39), శ్రేయస్ అయ్యర్(15) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
9 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిజిత్ తోమర్.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో.. వెంకటేశ్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
క్వింటన్ డికాక్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్
ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ చేలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. డికాక్ కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక కెప్టెన్ రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు సాధించాడు.
డికాక్ సెంచరీ..18 ఓవర్లకు లక్నో స్కోర్: 164/0
లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో మెరిశాడు. 60 బంతుల్లో 102 పరుగులు సాధించి ఆడుతున్నాడు. 18 ఓవర్లకు లక్నో స్కోర్: 164/0
భారీ స్కోర్ దిశగా లక్నో.. 17 ఓవర్లకు స్కోర్: 149/0
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 149 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్(89), రాహుల్(59) దూకుడుగా ఆడుతున్నారు.
11 ఓవర్లకు లక్నో స్కోర్: 92/0
11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(48), రాహుల్(43)పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు లక్నో స్కోర్: 57/0
8 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(29), రాహుల్(27)పరుగులతో ఉన్నారు.
5 ఓవర్లకు లక్నో స్కోర్: 38/0
5 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(21), రాహుల్(17)పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు లక్నో స్కోర్ 14/0
2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(12), రాహుల్(2)పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్-2022లో భాగంగా కీలక పోరులో డివై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేకేఆర్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
Related News By Category
Related News By Tags
-
IPL 2026: గ్రీన్ ధర రూ. 30.50 కోట్లు.. ఎవరు కొన్నారంటే?
క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే కేంద్రీకృతమై ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) వేలంపాట నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, అంతకంటే ముందు ...
-
కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయో సీజన్లో కూడా తమ జట్టు కెప్టెన్‌గా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను కొనసాగించాలని కే...
-
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్కే వెంకటేశ్ అయ్యర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 63.30 ...
-
నీ ఒంటికి వేరే జెర్సీ సూట్ అవ్వదు: షారుఖ్ ఖాన్ పోస్ట్ వైరల్
వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.....
-
ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2026 వేలానికి వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే క్యాష్ రిచ్ లీ...


