బట్లర్‌కు సామ్సన్‌ నిక్‌నేమ్‌.. వీడియో వైరల్‌

IPL 2021: Sanju Samson Gives A new Nickname To Jos Buttler - Sakshi

ముంబై:   ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్థాన్‌ జట్లు సోమవారం ముఖాముఖి పోరులో తలపడేందుకు సిద్దమయ్యాయి. అంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ఆడి మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.  దాంతో రాజస్థాన్‌ ఆటగాళ్ల టీమ్‌ బాండింగ్‌ నిర్వహించారు. ప్రధానంగా యువ క్రికెటర్లు.. స్టార్‌ ఆటగాళ్లతో ఇంటరాక్ట్‌ అయి వారి వద్ద నుంచి తెలుసుకున్న విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌.. జోస్‌ బట్లర్‌కు ఓ నిక్‌నేమ్‌ తగిలించాడు. 

మనం సర్వసాధారణంగా అవతలి వ్యక్తిగా గౌరవించే క్రమంలో ఉచ్చరించే భాయ్‌ అనే మాటని జోస్‌ పేరులో చేర్చాడు సామ్సన్‌. తాను జోస్‌ బట్లర్‌ నుంచి ఏమి నేర్చుకున్నాననే విషయాలు చెబుతూ ‘జోస్‌ భాయ్’‌ అని ఉచ్చరించాడు. అయితే బట్లర్‌ను జోస్‌ భాయ్‌ అని సామ్సన్‌ తొలిసారి పలకడంతో అక్కడ ఉన్న టీమ్‌ సభ్యులంతా పగలబడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్‌ రాయల్స్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది.  ఈ వీడియోకు ఫ్యాన్స్‌ నుంచి విశేష మద్దతు రావడంతో బాగా వైరల్‌గా మారింది. ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఆ ట్వీట్‌ను రీట్వీట్‌లు చేస్తున్నారు. 

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌లో సోమవారం వాంఖడే వేదికగా జరుగనున్న పోరుకు సన్నద్దమయ్యాయి.  ప్రస్తుత సీజన్‌లో ఇరుజట్లు ముఖాముఖి పోరులో తలపడటం ఇదే మొదటిసారి. కాగా, సీఎస్‌కే రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలుపొందగా, రాజస్థాన్‌ సైతం రెండు మ్యాచ్‌లకు గాను ఒక మ్యాచ్‌లో  విజయం సాధించింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 24సార్లు ఐపీఎల్‌ ఎన్‌కౌంటర్‌లో తలపడగా సీఎస్‌కే 14సార్లు, రాజస్థాన్‌ 10సార్లు విజయాన్ని అందుకున్నాయి.  గత సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ రాజస్థానే విజయం సాధించింది. 

ఇక్కడ చదవండి: ‘క్రికెట్‌ చరిత్రలోనే అది అత్యంత చెత్త రూల్‌’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top