ఒక్క ఓవర్.. 37 పరుగులు.. జడ్డూ విధ్వంసం

ముంబై: ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్, రెండు పరుగులు సాధించి మొత్తం 37 పరుగులు పిండుకున్నాడు. దీంతో సీఎస్‌కే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఒక దశలో సీఎస్‌కే ఇన్నింగ్స్ 170 పరుగుల వద్ద ఆగిపోతుందని అంతా భావించగా.. జడేజా తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు .
హర్షల్ పటేల్ వేసిన మొదటి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్‌గా మలిచిన జడేజా.. రెండో బంతిని కవర్స్ దిశగా సిక్స్ బాదాడు. హర్షల్ వేసిన మూడో బంతి నోబాల్ కాగా దానిని లాంగాన్ మీదుగా సిక్స్‌గా మలిచిన జడేజా అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.. ఆ తర్వాత వేసిన ప్రీ హిట్‌ను కూడా సిక్సర్‌గా మలిచి వరుసగా నాలుగు బంతులను నాలుగు సిక్స్‌లు కొట్టి విధ్వంసం సృష్టించాడు.
అయితే ఓవర్ నాలుగో బంతిని సిక్స్ కొట్టడానికి ప్రయత్నించగా.. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జడేజా రెండు పరుగులు సాధించాడు. ఇక ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా మరోసారి సిక్స్ కొట్టిన జడేజా ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచాడు. అంతకముందు డుప్లెసిస్ 50, రైనా 24 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్ ఒక వికెట్ తీశాడు.
చదవండి: సిక్సర్లలో 7వ స్థానం.. అరుదైన రికార్డు
Jaddu at its best@imjadeja
.
.#CSKvsRCB #jadeja #IPL #Trending #MSDhoni pic.twitter.com/Ky1UV7bi6C— Lellapati Manikanta Reddy (@manilellapati) April 25, 2021