
Rishab Pant As Delhi Capitals Captain.. ఐపీఎల్–2021 మిగిలిన సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) సారథిగా రిషభ్ పంత్‌నే కొనసాగిస్తున్నట్లు టీమ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. డీసీ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయంతో తొలి దశ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో డీసీ మేనేజ్‌మెంట్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అయితే అయ్యర్ కోలుకొని తిరిగి జట్టులోకి రావడంతో కెప్టెన్‌గా ఎవరుంటారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. చివరకు తొలి దశ ఐపీఎల్‌లో జట్టును గొప్పగా నడిపిన పంత్ వైపే డీసీ యాజమాన్యం మొగ్గు చూపింది.
చదవండి: Sheldon Jackson: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని