78 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇలా ఔటయ్యాడు..!

Faf du Plessis Dismissed LBW First Time In 78 Innings In IPL - Sakshi

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ డుప్లెసిస్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక్కడ మూడు బంతులు ఆడిన డుప్లెసిస్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. దాంతో 7 పరుగులకే సీఎస్‌కే తొలి వికెట్‌ను కోల్పోయింది.  కాగా,  ఐపీఎల్‌లో డుప్లెసిస్‌ ఇలా ఎల్బీగా ఔట్‌ కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 85 మ్యాచ్‌లకు గాను 78 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ ఏనాడు ఐపీఎల్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరలేదు డుప్లెసిస్‌. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా సీఎస్‌కేను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదట ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డు ప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరగ్గా... వోక్స్‌ వేసిన మరుసటి ఓవర్లో 5 పరుగులు చేసిన రుతురాజ్‌ స్లిప్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 7 పరుగుల వద్దే వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ‌  

ఆపై సీఎస్‌కే స్కోరు 60 పరుగుల వద్ద ఉండగా మొయిన్‌ అలీ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 36 పరుగులు చేసిన మొయిన్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన మొయిన్‌ మళ్లీ భారీ షాట్‌కు యత్నించి ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top