డానియల్‌ సామ్స్‌కు నెగెటివ్‌  | IPL 2021: Daniel Sams Joins RCB After Two Negative COVID 19 Tests | Sakshi
Sakshi News home page

డానియల్‌ సామ్స్‌కు నెగెటివ్‌ 

Apr 18 2021 1:41 PM | Updated on Apr 18 2021 2:07 PM

IPL 2021: Daniel Sams Joins RCB After Two Negative COVID 19 Tests - Sakshi

Photo Courtesy: Instagram

చెన్నై: గత వారం కరోనా వైరస్‌ బారిన పడ్డ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్‌ డానియల్‌ సామ్స్‌కు తాజాగా చేసిన రెండు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలలో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దాంతో తిరిగి ఆర్‌సీబీ టీమ్‌ బయో బబుల్‌లో అడుగుపెట్టిన అతడు శనివారం జట్టుతో కలిశాడు. 28 ఏళ్ల సామ్స్‌ ఈ నెల 3వ తేదీన చెన్నైకి చేరుకోగా... అప్పుడు చేసిన తొలి టెస్టులో నెగెటివ్‌గా తేలాడు.

అయితే ఏప్రిల్‌ 7న చేసిన రెండో కరోనా పరీక్షలో అతడు పాజిటివ్‌గా తేలాడు. అప్పటి నుంచి క్వారంటైన్‌లోనే ఉంటున్నాడు. కరోనా బారిన పడి కోలుకున్న రెండో ఆర్‌సీబీ ప్లేయర్‌గా సామ్స్‌ నిలిచాడు. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ వైరస్‌ బారిన పడి కోలుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement