ఐపీఎల్‌ 2021: జడ్డూ ఆల్‌రౌండ్‌ షో.. సీఎస్‌కే ఘన విజయం

IPL 2021: CSK Vs RCB Liv Updates, Highlights - Sakshi

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే మరో విజయాన్ని నమోదు చేసింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ షో కనబరచడంతో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పడిక్కల్‌(34) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్‌ 22 పరుగులు చేయగా.. మిగతావారు సీఎస్‌కే బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లారు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా 3, తాహిర్‌ 2, శార్ధూల్‌, సామ్‌ కరన్‌ చెరో వికెట్‌ తీశారు.తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆడిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో జడేజా 62 నాటౌట్‌ మెరుపులు మెరిపించగా.. డుప్లెసిస్‌ 50 పరుగులతో రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, చహల్‌ ఒక వికెట్‌ తీశారు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
ఆర్‌సీబీ వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. తాహిర్‌ మొదట తాను వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ ఆఖరి బంతికి హర్షల్‌ పటేల్‌(0) క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. తన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే సైనీని క్యాచ్‌ అవుట్‌గా పంపించాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ స్కోరు 95/8 గా ఉంది.

ఏబీ ఔట్‌, ఆరో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఏబీ డివిలియర్స్‌(4) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  రవీంద్ర జడేజా వేసిన 11 ఓవర్‌  తొలి బంతికి ఏబీ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో ఆర్సీబీ 83 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది కోహ్లి గ్యాంగ్‌.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
ఆర్సీబీ స్వల్స వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. 79 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయిన ఆర్సీబీ..81 పరుగుల వద్ద మరో వికెట్‌ను నష్టపోయింది. నాల్గో వికెట్‌గా మ్యాక్స్‌వెల్‌(22) ఔటైతే, ఐదో వికెట్‌గా డానియల్‌ క్రిస్టయన్‌(1) ఐదో వికెట్‌గా రనౌట్‌ అయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
వాషింగ్టన్‌ సుందర్‌(7) రూపంలో ఆర్‌సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు యత్నించి రుతురాజ్‌కు క్యాచ​ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.  

పడిక్కల్‌ ఔట్‌.. ఆర్‌సీబీ 65/2
34 పరుగులు చేసిన పడిక్కల్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 6 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 10, సుందర్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లి అవుట్‌.. ఆర్‌సీబీ 45/1
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కోహ్లి(8) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ తొలి బంతిని కోహ్లి ఆడే ప్రయత్నంలో కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే పడిక్కల్‌ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 45 పరుగులు చేసింది. పడిక్కల్‌ 32, సుందర్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

జడేజా సిక్సర్ల వర్షం.. సీఎస్‌కే 191/4
హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో జడేజా ఐదు సిక్సర్లతో వీరవిహారం సృష్టించడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 2 పరుగులతో ధోని అతనికి సహకరించాడు. అంతకముందు డుప్లెసిస్‌ 50, రైనా 24 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, చహల్‌ ఒక వికెట్‌ తీశాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. 145/4
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన అంబటి రాయుడు హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

మూడో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. 138/3
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ నాలుగో బంతికి రైనా(24) అవుటవ్వగా.. ఐదో బంతికి డుప్లెసిస్‌(50) క్రిస్టియన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు ఓవర్లో డుప్లెసిస్‌ అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం సీఎస్‌కే స్కోరు 17 ఓవర్లలో 138/3గా ఉంది.

డుప్లెసిస్‌ ఫిప్టీ.. సీఎస్‌కే 111/1
24 పరుగులు చేసిన సురేశ్‌ రైనా భారీ షాట్‌కు యత్నించి 14వ ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు డుప్లెసిస్‌ 50  సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే మూడు సిక్సర్లు బాదిన రైనాకు తోడు డెప్లెసిస్‌ కూడా ధాటిగా ఆడుతుండడంతో సీఎస్‌కే భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 111 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 50, రైనా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
రుతురాజ్‌ గైక్వాడ్‌(33) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ తొలి బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన రుతురాజ్‌ జేమిసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. డెప్లెసిస్‌(40) , రైనా(7) క్రీజులో ఉన్నారు.   

దూకుడు కనబరుస్తున్న సీఎస్‌కే
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే దూకుడు కనబరుస్తుంది. ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు ఆర్‌సీబీ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలు బాదుతున్నారు. ప్రస్తుతం సీఎస్‌కే 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకకుండా 74 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 38, రుతురాజ్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.

6 ఓవరల్లో సీఎస్‌కే 51/0
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే దూకుడుగా ఆడుతుంది. పవర్‌ ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 27, రుతురాజ్‌ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. డుప్లెసిస్‌ మంచి టైమింగ్‌ కనబరుస్తూ ఫోర్లు బాదుతున్నాడు.

ముంబై:ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  ప్రస్తుతం ఐపీఎల్‌లో ఇరుజట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకూ ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక సీఎస్‌కే మూడు విజయాలతో రెండో స్థానంలో ఉంది. 

దాంతో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఇరుజట్లు తలపడిన ముఖాముఖి పోరులో సీఎస్‌కేదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరగ్గా అందులో సీఎస్‌కే 17 విజయాలు నమోదు చేయగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌లను గెలిచింది. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో ఇరుజట్లు తలో మ్యాచ్‌ గెలిచాయి. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఎనిమిది వికెట్ల తేడాతో గెలవగా, ఆపై తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీ 37 పరుగుల తేడాతో సీఎస్‌కేను ఓడించింది.   ఈ సీజన్‌లో ఇదే వీరికి తొలి ముఖాముఖి పోరు. 

తుది జట్లు:
ఆర్‌సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, డేనియల్‌ క్రిస్టియన్‌‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైనీ‌, జెమీసన్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజ్వేంద్ర చహల్‌, హర్షల్‌ పటేల్‌

సీఎస్‌కే: డుప్లెసిస్‌, రుతురాజ్‌, డ్వేన్‌ బ్రావో, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్‌ ధోని, రవీంద్ర జడేజా, ఇమ్రాన్‌ తాహిర్‌, సామ్‌ కర్రన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, చాహర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top