రాజస్తాన్‌ స్టార్‌ ఆటగాడిపై ఆ జట్టు కోచ్‌ కీలక వాఖ్యలు.. | IPL 2021: Chris Morris Has Not Done The Job As We Wanted Says Kumar Sangakkara | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ స్టార్‌ ఆటగాడిపై ఆ జట్టు కోచ్‌ కీలక వాఖ్యలు..

Sep 30 2021 12:59 PM | Updated on Sep 30 2021 2:11 PM

IPL 2021: Chris Morris Has Not Done The Job As We Wanted Says Kumar Sangakkara - Sakshi

Courtesy: IPL

Kumar Sangakkara  Comments On  Chris Morris:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమిపై రాజస్తాన్‌ రాయల్స్‌  కోచ్‌ కుమార సంగర్కర స్పందించాడు. బౌలర్ల వైఫల్యంపై అతడు  ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌   క్రిస్‌ మోరీస్‌ బౌలింగ్‌ పేలవ ప్రదర్శనపై  అసహనం వ్యక్తం చేశాడు. కాగా  ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేజ్‌లో భాగంగా ఆర్సీబీతో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌(58), యశస్వి జైస్వాల్‌(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది.  తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన బెంగళూరును కట్టడి చేయలేక పేలవ బౌలింగ్‌ ప్రదర్శనతో రాజస్తాన్‌ చతికిలపడింది. ఈ ఓటమితో రాజస్తాన్‌ ప్లేఆప్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. 

మ్యాచ్‌ అనం‍తరం విలేఖరల సమావేశంలో అతడు మాట్లాడుతూ.. " ఐపీఎల్‌ 2021 మెదటి దశలో  క్రిస్ మోరిస్  అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కానీ  సెకండ్ ఫేజ్‌లో మేము ఆశించింనంతగా  బౌలింగ్‌ చేయలేదు. అది అతడికి కూడా తెలుసు. ఎందుకంటే తన  4 ఓవర్ల కోటాలో  50 పరుగుల ఇచ్చాడు. అతడు చాలా సమయాల్లో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. తదుపరి మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో తిరిగి  ఫామ్ కనబరుస్తాడని భావిస్తున్నాను''అని సంగర్కర పేర్కొన్నాడు.

చదవండి: Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement