Liger Movie 'MMA' Fight: 'లైగర్' సినిమా ఎమ్‌ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా ''లైగర్'' ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే.. ఈ సినిమా ఎంఎంఏ ఫైట్(మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో తెరకెక్కింది. మన దేశంలో చాలా మంది ఎంఎంఏ అంటే తెలిసి ఉండకపోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్లకు మాత్రమే ఈ క్రీడపై కాస్త అవగాహన ఉంటుంది. చాలా మందికి తెలియని ఎంఎంఏ క్రీడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
-సాక్షి,డెబ్‌డెస్క్
photo credit : Getty Images
ఎంఎంఏ ఫైట్(మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జడో, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల నుంచి తీసుకున్న కొన్ని టెక్నిక్స్‌తో ఎంఎంఏను రూపొందించారు. అయితే ఎంఎంఏ రూపొందించిన తొలి రోజుల్లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో అత్యంత క్రూరమైన క్రీడగా చాలా మంది పేర్కొన్నారు.కానీ కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న క్రీడగా ఆదరణ పొందుతుండడం విశేషం.
photo credit : Getty Images
చరిత్ర తిరగేస్తే క్రీస్తూ పూర్వమే ఎంఎంఏ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ఆడారని ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. మనకు తెలిసి 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఎంఎంఏ గేమ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్‌కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు యూఎఫ్‌సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఎంఎంఏ(మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్)పై అమెరికా సహా చాలా దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఎంఎంఏ మ్యాచ్‌ల్లో విజయాలను సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా నిర్ణయిస్తుంటారు.
photo credit : Getty Images
ఎంఎంఏ ఆట.. కఠిన నిబంధలు
►దశ దిశ లేకుండా సాగుతున్న ఎంఎంఏ ఆటకు యూఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్) కొన్ని స్థిరమైన నిబంధనలు, రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు, రూల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం
►రింగ్‌లోకి వెళ్లే ఆటగాళ్లు ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతోనే పోరాడాలి
►బూట్లు వేసుకోకూడదు.. తలకు ఎటుంటి సేఫ్‌గార్డ్స్ పెట్టుకోకూడదు.
►ప్రత్యర్థి ఆటగాడి కంట్లో పొడవడం, కొరకడం, జట్టు లాగడం, తలతో కొట్టడం వంటివి పూర్తిగా నిషేధం.
photo credit : Getty Images
ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్‌షిప్ బౌట్స్‌లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్(ప్రత్యర్థిని ఓటమి ఒప్పుకునేలా చేయడం) ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే మాత్రం.. ఇద్దరిలో విజేత ఎవరనేది ప్యానెల్ నిర్ణయిస్తుంది.
photo credit : Getty Images
ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్‌లో ఉన్న యూఎఫ్‌సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ప్రతీ ఏడాది వివిధ స్థాయిల్లో యూఎఫ్‌సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా సెకండాఫ్ మొత్తం లాస్‌వేగాస్‌లో షూటింగ్ జరుపుకుంది.
చదవండి: 'లైగర్' బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడిన మౌత్ టాక్
Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు..