సుహాస్‌కు స్వర్ణం | Indian shuttlers bag three golds in Para Badminton World Championship | Sakshi
Sakshi News home page

సుహాస్‌కు స్వర్ణం

Feb 26 2024 4:30 AM | Updated on Feb 26 2024 4:30 AM

Indian shuttlers bag three golds in Para Badminton World Championship - Sakshi

పట్టాయ: పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో అదరగొట్టారు. పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎల్‌–4 విభాగంలో ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌... ఎస్‌ఎల్‌–3 విభాగంలో ప్రమోద్‌ భగత్‌... ఎస్‌హెచ్‌–6 విభాగంలో కృష్ణ నాగర్‌ పసిడి పతకాలు సొంతం చేసుకొని ప్రపంచ చాంపియన్స్‌గా అవతరించారు.

ఫైనల్స్‌లో సుహాస్‌ 21–18, 21–18తో ఫ్రెడీ సెతియవాన్‌ (ఇండోనేసియా)పై, ప్రమోద్‌ 14–21, 21–15, 21–14తో డేనియల్‌ బెథెల్‌ (ఇంగ్లండ్‌)పై, కృష్ణ నాగర్‌ 22–20, 22–20తో లిన్‌ నైలీ (చైనా)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు.    

Advertisement
 
Advertisement
Advertisement