
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ కార్ల్‌టన్ చాప్‌మన్ కన్నుమూశాడు. గుండెపోటుతో బెంగళూరులో సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఆదివారం అస్వస్థతకు గురైన 49 ఏళ్ల చాప్‌మన్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించినట్లు ఆయన టీమిండియా సహచరుడు బ్రూనో కౌటిన్హో తెలిపాడు. 1995 నుంచి 2001 వరకు చాప్‌మన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోని టీమిండియా 1997 ‘శాఫ్’ కప్‌ను గెలుచుకుంది.