దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లో ఓటమి చెందిన టీమిండియా.. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న మూడో టీ20లో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో భారత్ వెనుకబడి ఉంది. అయితే మూడో టీ20కు టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
అదే విధంగా టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడికి మూడో టీ20కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు పేసర్ ఆవేష్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్థానంలో ఆర్షదీప్‌కు సింగ్‌ను ఆడించాలని మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ మరో సారి బెంచ్‌కే పరిమతమయ్యే అవకాశం ఉంది.
తుది జట్టు అంచనా :
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
చదవండి: Joe Root: ఎప్పుడు కొట్టని షాట్ ఆడాడు.. అందుకే ఆశ్యర్యపోయాడా?