Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్‌.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌.. బీసీసీఐ ప్రకటన

India A vs New Zealand A ODI Series: Sanju Samson To Lead Indian Squad - Sakshi

New Zealand A tour of India, 2022- Unofficial ODI Series- Sanju Samson: న్యూజిలాండ్‌- ఏ జట్టుతో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. 

కేఎస్‌ భరత్‌, తిలక్‌ వర్మ ఈ జట్టులో కూడా!
ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన 16 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టులో తెలుగు క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌కు స్థానం దక్కింది. అదే విధంగా హైదరాబాదీ తిలక్‌ వర్మను కూడా ఈ జట్టుకు ఎంపిక చేశారు. కాగా వీరిద్దరు టెస్టు జట్టుకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే.

ఇక యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం ఈ వన్డే జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్‌ ఆడే నిమిత్తం న్యూజిలాండ్‌ ఏ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

చెన్నై వేదికగా..
తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో టెస్టు రెండో రోజు(శుక్రవారం) ఆట కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్‌ తర్వాత సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్‌లో భారత ఏ జట్టు.. కివీస్‌ ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ తమిళనాడులోని చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2022కు ప్రకటించిన జట్టులో కనీసం స్టాండ్‌ బై ప్లేయర్‌గా కూడా సంజూకు అవకాశం దక్కలేదన్న విషయం తెలిసిందే.

దీంతో బీసీసీఐపై సంజూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఏ’ జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించడం పట్ల స్పందిస్తూ.. ‘బాగానే కవర్‌ చేశారులే’ అంటూ మరోసారి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇండియా- ఏ జట్టు:
సంజూ శాంసన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పాటిదార్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైనీ, రాజ్‌ అంగద్‌ బవా. 

చదవండి: కోహ్లి, రోహిత్‌లను అవుట్‌ చేస్తే.. సగం జట్టు పెవిలియన్‌ చేరినట్లే! అలా అనుకుని..
వెంకటేశ్‌ అయ్యర్‌కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్‌ వచ్చినప్పటికీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top