టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..!? | India vs Canada Weather Report: Will Florida Rain Wash Out Men In Blues Last Legue Match | Sakshi
Sakshi News home page

T20 WC: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..!?

Published Sat, Jun 15 2024 6:39 PM | Last Updated on Sat, Jun 15 2024 6:51 PM

India vs Canada Weather Report: Will Florida Rain Wash Out Men In Blues Last Legue Match

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌  ఆడేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం(జూన్‌ 15)న ఫ్లోరిడా వేదికగా కెనడాతో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే సూపర్‌-8 బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. పసికూన కెనడాను సైతం చిత్తు చేసి ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు ఓ బ్యాడ్‌న్యూస్‌. భారత్-కెనడా మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉన్నట్లు వెదర్‌.కామ్‌ పేర్కొంది. మ్యాచ్‌ సమయంలో వర్షం పడే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు వెదర్‌.కామ్ తెలిపింది. 

ఉరుములతో కూడా భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించనుంది. 

కాగా లాడర్‌హిల్‌లో శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement