U19 World Cup: స్వదేశంలో యశ్‌ ధుల్‌ సేనకు ఘన స్వాగతం.. ఉబ్బి తబ్బిబ్బయిన యువ క్రికెటర్లు

India U19 World Cup Winning Team Reaches Home - Sakshi

U19 World Cup 2022: అండర్‌ 19 ప్రపంచకప్‌ 2022 టైటిల్‌ కైవసం చేసుకున్న యువ భారత జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణాంతరం యశ్‌ ధుల్‌ సేన ఇవాళ ఉదయం బెంగళూరుకు రీచ్‌ అయ్యింది. యువ ఛాంపియన్లు సొంతగడ్డపై ల్యాండ్‌ కాగానే అభిమానుల అరుపులు, కేరింతలతో విమానాశ్రయం హోరెత్తాంది. అభిమానుల ఆదరణ చూసి టీమిండియా క్రికెటర్లు ఉబ్బితబ్బి బ్బి పోయారు.

భారత యువ జట్టు బుధవారం బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన వేడుక కోసం బెంగళూరు నుంచి నేరుగా అహ్మదాబాద్‌కు వెళ్లనుంది. కాగా, గడిచిన  ఆదివారం జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ టైటిల్‌ పోరులో యంగ్‌ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదో సారి ప్రపంచకప్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

ఫైనల్లో ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 2 బంతులు మిగిలుండగానే చేధించింది. నిషాంత్‌ సింధు(50 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చగా.. షేక్‌ రషీద్‌(50), రాజ్‌ బవా(35) రాణించారు. అంతకుముందు యంగ్‌ ఇండియా పేసర్లు రాజ్‌ బవా(5/31), రవికుమార్‌(4/34)ల ధాటికి ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్‌ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడటంతో ఇంగ్లండ్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
చదవండి: మెగావేలానికి మరో నాలుగు రోజులే.. జేసన్‌ రాయ్‌ విధ్వంసం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top