వన్డే ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన గిల్, కిషన్‌.. | India duo make ground on Babar with latest rankings push - Sakshi
Sakshi News home page

ICC Rankings: వన్డే ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన గిల్, కిషన్‌..

Published Wed, Sep 6 2023 3:20 PM

India duo make ground on Babar with latest rankings push - Sakshi

ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో భారత బ్యాటర్లు శబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ మూడో స్ధానానికి చేరుకున్నాడు. ఇంతకుముందు నాలుగో ర్యాంక్‌లో ఉన్న గిల్‌.. ఆసియాకప్‌-2023లో భాగంగా నేపాల్‌పై అద్భుతంగా రాణించడంతో తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ 62 బంతుల్లో 67 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

మరోవైపు పాకిస్తాన్‌తో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌ 12 స్ధానాలు ఎగబాకి 24వ స్ధానానికి చేరుకున్నాడు. కిషన్‌ పాకిస్తాన్‌పై 82 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక​ టాప్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(882 పాయింట్లు) ఉండగా.. రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా స్టార్‌ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నాడు.

టాప్‌ 10 వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్ జాబితా
1.బాబర్ ఆజం (పాకిస్తాన్)
2.రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)
3.శుబ్‌మన్‌ గిల్(భారత్‌)
4.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)
5.హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్)
6.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
7.ఫఖర్ జమాన్ (పాకిస్తాన్)
8.క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)
9.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
10.విరాట్ కోహ్లీ (భారత్‌)
చదవండి: రోహిత్‌, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్‌: గంభీర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement