భార‌త బ్యాట‌ర్ల ఊచ‌కోత‌.. ఏకంగా 358 ప‌రుగులు | IND-W vs WI-W: Harleen century powers IND-W to 358 | Sakshi
Sakshi News home page

IND-W vs WI-W: భార‌త బ్యాట‌ర్ల ఊచ‌కోత‌.. ఏకంగా 358 ప‌రుగులు

Dec 24 2024 5:43 PM | Updated on Dec 24 2024 6:03 PM

IND-W vs WI-W: Harleen century powers IND-W to 358

వడోదర వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త మ‌హిళల జ‌ట్టు జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్‌​ సాధించింది. మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటర్లు తమపని తాము చేసుకుపోయారు.

భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్‌(76), రోడ్రిగ్స్‌(52) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. హర్లీన్ డియోల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. 

ఇక విండీస్ బౌలర్లలో డొటిన్‌, ఫ్లెచర్‌, జేమ్స్, జోషఫ్ తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళ జట్టు 358 పరుగులు చేయడం ఇది రెండో సారి. అదనంగా మరో పరుగు చేసి ఉంటే భారత్‌కు అత్యధిక వన్డే స్కోర్‌ను నెలకొల్పేది. గతంలో 2017లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
చదవండి: WI vs PAK: వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్‌ సెంచరీ వీరుడికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement