IND vs WI T20Is: Rishabh Pant as India Vice-Captain for T20I Series Against West Indies - Sakshi
Sakshi News home page

Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్‌ ఆఫర్‌.. వైస్‌ కెప్టెన్‌గా ఛాన్స్‌

Feb 15 2022 2:09 PM | Updated on Feb 15 2022 6:24 PM

Ind Vs Wi T20 Series: Rishabh Pant Promoted As India Vice Captain - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. కోల్‌కతా వేదికగా విండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. కాగా టీమిండియా టీ20 ​ వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 24 ఏళ్ల పంత్‌కు ఈ ఛాన్స్‌ దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.

ఇక ఫిబ్రవరి 16 నుంచి ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు రాహుల్‌తో పాటు, వాషింగ్టన్‌ సుందర్‌ కూడా దూరమయ్యాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఎడమకాలు కండరాల నొప్పితో సుందర్‌ విలవిల్లాడాడు. నొప్పి తీవ్రతరం కావడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లాడు. అతడి స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి రానున్నాడు. 

వెస్టిండీస్‌తో టీమిండియా టీ20 సిరీస్‌
భారత జట్టు:

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వైస్‌ కెప్టెన్- వికెట్‌ కీపర్‌‌), యజువేంద్ర చహల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడా, కుల్దీప్‌ యాదవ్‌. 

చదవండి: Washington Sundar: సుందర్‌ది దురదృష్టమే.. కాకపోతే చెప్పండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement