Ind Vs Wi: Sunil Gavaskar Surprised To See Rishabh Pant Open Should Be Finisher - Sakshi
Sakshi News home page

Ind Vs Wi 2nd ODI: అతడు ఓపెనర్‌ ఏంటి? ఫినిషర్‌గా ఉండాలి... జడ్డూ లేకపోవడం పెద్ద లోటు: టీమిండియా దిగ్గజం

Feb 10 2022 1:26 PM | Updated on Feb 10 2022 3:08 PM

Ind Vs Wi: Sunil Gavaskar Surprised To See Rishabh Pant Open Should Be Finisher - Sakshi

Ind Vs Wi: అతడు ఓపెనర్‌ ఏంటి? ఫినిషర్‌గా ఉండాలి: టీమిండియా దిగ్గజం

Sunil Gavaskar Says India Missing Ravindra Jadeja: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్‌గా మైదానంలో దిగాడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌. రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినా అతడిని కాదని.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పంత్‌కు అవకాశం ఇచ్చాడు. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాడు. అయితే, ఓపెనర్‌గా పంత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 34 బంతులు ఆడిన అతడు కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఓడెన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్‌ను ఓపెనర్‌గా పంపడం తనకు నచ్చలేదన్నారు. రెండో వన్డే జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ... ‘‘రిషభ్‌ పంత్‌ను ఓపెనర్‌గా చూసి ఆశ్చర్యపోయాను. నా అభిప్రాయం ప్రకారం.. స్కోరును అనుసరించి అతడు ఆరు లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. తను ఫినిషర్‌గా ఉండాలి. రోహిత్‌కు ఓపెనింగ్‌ జోడీగా రాహుల్‌ సరైనవాడు. సూర్యకుమార్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత పంత్‌... వాషింగ్టన్‌ సుందర్‌ రావాలి’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా  టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై గావస్కర్‌ ప్రశంసలు కురిపించారు. ‘‘జడేజా సేవలను జట్టు కోల్పోతోంది. అతడు ఉంటే ఏడు లేదంటే ఎనిమిదో స్థానం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హిట్టింగ్‌ ఆడతాడు. భారీ షాట్లు కొడతాడు. అద్భుతమైన ఫీల్డర్‌. వికెట్లు పడగొట్టడం సరేసరి. నిజంగా అతడి అమూల్యమైన సేవలను టీమిండియా మిస్సవుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా ఓపెనర్‌గా పంత్‌ విఫలమైనా... నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్‌ మెరుగ్గా రాణించాడు. అయితే, అద్భుత స్ట్రైక్‌రేటు(102.08)తో ఆకట్టుకున్నా.. రనౌట్‌ కావడంతో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక పంత్‌ను ఓపెనర్‌గా పంపడం కేవలం ఒక ప్రయోగం మాత్రమేనని రోహిత్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022 Auction: 8 కోట్లు.. అతడు ఇరగదీస్తున్నాడు.. 6 కోట్లు ఖర్చు చేశారు... ఈ ‘హిట్టర్‌’ మాత్రం.. ‘ముంబై’ తప్పుచేసిందా?
Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement