BCCI New Jersey Sponsor: టీమిండియా ‘కిట్‌’ మారింది! జెర్సీలపై ఇక ‘కిల్లర్‌ జీన్స్‌’ లోగో

Ind Vs SL Team India New Kit Sponsor Jersey MPL Replaced By Killer - Sakshi

Team India New Jersey: భారత క్రికెట్‌ జట్టు ‘కిట్‌’లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ‘కిట్‌’ స్పాన్సర్‌గా ఉండగా... ఇప్పుడు దాని స్థానంలో కేవల్‌ కిరణ్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌ (కేకేసీఎల్‌) వచ్చింది. ఎంపీఎల్‌తో ఈ ఏడాది మార్చి వరకు బీసీసీఐకి ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్‌ బోర్డును ఇటీవలే కోరింది.

అందుకే మూడు నెలల స్వల్ప కాలానికి కేకేసీఎల్‌ సీన్‌లోకి వచ్చింది. దాంతో శ్రీలంకతో సిరీస్‌నుంచి కేకేసీఎల్‌ తమ పాపులర్‌ బ్రాండ్‌ ‘కిల్లర్‌ జీన్స్‌’ లోగోను టీమిండియా జెర్సీలపై ప్రదర్శించనుంది. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌తో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని యువ జట్టుతో టీమిండియా 2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం (జనవరి 3)న తొలి టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్‌, రుతు​.. ఇంకా 
టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవాకు ఒకేసారి రెండు క్యాన్సర్‌లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top