IND Vs NZ 3rd T20I: India Won The Toss And Opt To Bat, Chahal Out - Sakshi
Sakshi News home page

IND Vs NZ 3rd T20: ఫస్ట్‌ బ్యాటింగ్‌ టీమిండియాదే.. చహల్‌ ఔట్‌

Feb 1 2023 6:43 PM | Updated on Feb 1 2023 8:01 PM

IND VS NZ 3rd T20I: India Won The Toss And Opt To Bat, Chahal Out - Sakshi

3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్‌ డప్ఫీ స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ బెన్‌ లిస్టర్‌ జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలవడంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. 

టీమిండియా: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌

న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలప్స్‌, డారిల్‌ మిచెల్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), ఐష్‌ సోధీ, లోకీ ఫెర్గూసన్‌, బెన్‌ లిస్టర్‌, బ్లెయిర్‌ టిక్నర్‌ 


 

Advertisement
 
Advertisement
Advertisement