Ind Vs Eng: Sam Billings Single Handed Stunning Catch, Fans Troll Shreyas Iyer, Video Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Eng 5th Test: ఒంటి చేత్తో సామ్‌ బిల్లింగ్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. శ్రేయస్‌ నువ్వు మారవా?

Jul 2 2022 8:12 AM | Updated on Jul 2 2022 11:54 AM

Ind Vs Eng: Sam Billings Single Handed Stunner Fans Troll Shreyas Iyer - Sakshi

శ్రేయస్‌ అయ్యర్‌, సామ్‌ బిల్లింగ్స్‌(PC: ECB)

ఒంటి చేత్తో సామ్‌ బిల్లింగ్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. శ్రేయస్‌ నువ్వు మారవా అంటూ ట్రోల్స్‌!

India VS England 5th Test- Shreyas Iyer: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నిరాశ పరిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 11 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే, ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్‌​ ఆండర్సన్‌ వేసిన షార్ట్‌ బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. 

దీంతో వికెట్‌ కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌కు దొరికిపోయాడు. అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో ఒంటి చేత్తో ఒడిసిపట్టాడు బిల్లింగ్స్‌. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. మరోవైపు.. అయ్యర్‌ను అవుట్‌ చేసేందుకు షార్ట్‌ బాల్‌తో తాము పన్నిన పథకం సఫలం కావడంతో ఇంగ్లండ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ముఖంపై చిరునవ్వు విసిరింది.

కాగా ఐపీఎల్‌-2022లో అయ్యర్‌ సారథిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెకల్లమ్‌ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక సామ్‌ బిల్లింగ్స్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో షేర్‌ చేసింది.ఈ క్రమంలో అయ్యర్‌ అవుటైన తీరుపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు షార్ట్‌ బాల్‌కు వికెట్‌ పారేసుకున్న అతడు మళ్లీ అదే తప్పు పునరావృతం చేయడంపై మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. 

‘‘40 ఏళ్ల అంకుల్‌(ఆండర్సన్‌ను ఉద్దేశించి) బౌలింగ్‌లో.. మరీ ఇలా అవుటయ్యావు.. ఏంటిది అయ్యర్‌? నువ్వు చాలా బాగా ఆడతావు. కానీ షార్ట్‌ బాల్‌ మాత్రం నీ బలహీనత అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటావు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆటలో ఇవన్నీ సహజమని, అయితే అయ్యర్‌ అవుట్‌ కాగానే మెకల్లమ్‌ సంబరపడిపోయిన తీరు శ్రేయస్‌ విలువేంటో చాటుతోందని అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు.

చదవండి: IND vs ENG Test Day 1: పంత్‌ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా
Ind Vs Eng: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా?

1467703

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement