ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ | Ind vs Eng: Jofra Archer Ruled Out Of ODI Series vs India | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ

Mar 21 2021 5:47 PM | Updated on Mar 21 2021 5:49 PM

Ind vs Eng: Jofra Archer Ruled Out Of ODI Series vs India - Sakshi

అహ్మదాబాద్‌:  ఇప్పటికే టెస్టు సిరీస్‌, టీ20 సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు. మోచేతి గాయంతో వన్డే సిరీస్‌ నుంచి ఆర్చర్‌ వైదొలిగాడు. ఆదివారం ఇంగ్లండ్‌ ప్రకటించిన వన్డే జట్టులో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. 14 మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో ఆర్చర్‌కు విశ్రాంతి ఇస్తూ ఇంగ్లండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.  దాంతో ఆర్చర్‌ స్వదేశానికి పయనం కావడానికి సిద్ధమయ్యాడు. మార్చి 23(మంగళవారం) నుంచి పుణెలో ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

ఆర్చర్‌ స్థానంలో జాక్‌ బాల్‌ కానీ, క్రిస్‌ జోర్డాన్‌లను కానీ తుది జట్టులో ఆడించాలని ఇంగ్లండ్‌ యోచిస్తోంది. కాగా, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లండ్‌ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో వీరికి ఇంకా చోటు కల్పించలేదు. వన్డే సిరీస్‌కు వీరు రిజర్వ్‌ ఆటగాళ్లగానే ఉన్నారు. ఆర్చర్‌ గాయంతో ప్రస్తుతం రాజస్తాన్‌ రాయల్స్‌లో ఆందోళన మొదలైంది. ఆర్చర్‌ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాజస్తాన్‌ డైలమాలో పడింది. ఐపీఎల్‌ ఆరంభపు మ్యాచ్‌లకు ఆర్చర్‌ అందుబాటులో ఉండటం లేదు.‌ 

ఇంగ్లండ్‌ వన్డే జట్టు ఇదే..

ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), మొయిన్‌ అలీ, బెయిర్‌ స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, సామ్‌ కరాన్‌, టామ్‌ కరాన్‌, లివింగ్‌ స్టోన్‌, మ్యాట్‌ పార్కిన్‌సన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లే, మార్క్‌ వుడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement