Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్‌ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత..

Ind VS Ban 2nd Test: Shakib Won Toss Playing XI Kuldeep Out Unadkat In - Sakshi

Bangladesh vs India, 2nd Test- Playing XI: సిరీస్‌ గెలవడమే లక్ష్యంగా రెండో టెస్టు బరిలోకి దిగిన భారత తుది జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో 8 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ చైనామన్‌ స్పిన్నర్‌ స్థానంలో పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ జట్టులోకి వచ్చాడు.

మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌తో పాటు ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ కూడా బంగ్లాతో రెండో టెస్టులో భాగమయ్యాడు. మరోవైపు తొలి టెస్టులో రాణించిన స్పిన్‌ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ను కొనసాగించారు. దీంతో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగినట్లయింది. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత జయదేవ్‌ టెస్టు జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌
ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మొమినుల్‌ స్థానంలో మోమినుల్‌ , ఇబాదత్‌ హొసేన్‌ స్థానంలో టస్కిన్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చారు.

అందుకే కుల్దీప్‌ అవుట్‌: రాహుల్‌
టాస్‌ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించడం దురదృష్టకర నిర్ణయమని అయితే, జయదేవ్‌కు అవకాశం ఇవ్వడానికే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తాము టాస్‌ గెలిచినా ముందు బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు.

బంగ్లాదేశ్‌ వర్సెస్‌ భారత్‌ రెండో టెస్టు- తుది జట్లు ఇవే
భారత్‌: కేఎల్ రాహుల్(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కట్‌, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్‌: నజ్ముల్ హొస్సేన్ శాంటో, జాకీర్ హసన్, మోమినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), నూరుల్ హసన్(వికెట్‌ కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, టస్కిన్ అహ్మద్.

చదవండి: BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌! కిట్‌ స్పాన్సర్‌ కూడా! కారణం?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top