Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ

Ind Vs Aus 2023: Australia Announces ODI Squad Big Guns Returns - Sakshi

India Vs Australia ODI Series 2023 Squads: టీమిండియాతో వన్డే సిరీస్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ సహా పేసర్‌ జై రిచర్డ్‌సన్‌ పునరాగమనం చేయనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ వంటి అనుభవజ్ఞులతో సహా మార్నస్‌ లబుషేన్‌, సీన్‌ అబాట్‌ తదితరులకు జట్టులో చోటిచ్చింది. కాగా మార్చి 17 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌
ముంబై మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుండగా.. వైజాగ్‌(మార్చి 19), చెన్నై(మార్చి 22)లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో సిరీస్‌కు వన్డే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు దూరం కానుండగా.. హార్దిక్‌ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు.

టెస్టుల్లో వరుస ఓటములు
ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మార్చి 1-5, మార్చి 9-13 తేదీల్లో ఇండోర్‌, అహ్మదాబాద్‌లలో ఆఖరి రెండు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరోవైపు.. రెండో టెస్టు తర్వాత అ‍త్యవసరంగా స్వదేశానికి పయనమైన ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తిరిగి వస్తాడా లేదా అన్న సందేహాలు నెలకొనగా.. తాజా ప్రకటన అతడి రాకపై క్లారిటీ ఇచ్చింది.

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌.

చదవండి: T20 WC 2023: ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? టీమిండియా పటిష్ట జట్టు: ఆసీస్‌ కెప్టెన్‌
Virat Kohli: కోహ్లిపై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ట్వీట్‌.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top