WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. అందుకే ఈ పరిస్థితి: ఆసీస్‌ దిగ్గజం

I do think India have picked the wrong side, says Steve Waugh - Sakshi

లండన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి  రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన పరుగులతో మొత్తంగా ఆసీస్‌ 296 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇక అంతకుముందు భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. భారత తొలి ఇన్నింగ్స్‌లో  అజింక్య రహానే (89 పరుగులు), ఆల్‍రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు.

టీమిండియా చేసిన తప్పు అదే
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టు మెనెజ్‌మెంట్‌పై పలువరు మాజీ క్రికెటర్‌లు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌  స్టీవ్ వా చేరాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని స్టీవా అన్నాడు.

"ఓవల్‌ పిచ్‌ చాలా విచిత్రంగా ఉంటుంది. పిచ్‌పైన్‌ చూడడానికి గ్రీన్‌గా కనిపిస్తుంది. కానీ కిద కాస్త పగుళ్లు, డ్రైగా ఉంటుంది. అయితే ఆకాశం మేఘావృతమైనప్పుడు పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. అదే సూర్యుడు బయటకు వచ్చిన వెంటనే పిచ్‌ డ్రై అయిపోతుంది. స్పిన్నర్లకు కూడా ఈ పిచ్‌ అనుకూలిస్తుంది.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు భారత్‌ తమ తుది జట్లు తప్పుగా ఎంచుకుంది. ఈ టెస్టులో స్పిన్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అశ్విన్‌ జట్టులో ఉండాల్సింది. బౌలింగ్‌ విషయం పక్కన పెడితే బ్యాటింగ్‌లోనైనా అతడు ఉపయోగపడేవాడు. అతడికి టెస్టుల్లో ఐదు సెంచరీలు ఉన్నాయి.

డబ్ల్యూటీసీ సైకిల్‌ 2021-23లో భారత తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ అశ్విన్‌. అటువంటి ఆటగాడికి జట్టులో లేకపోవడం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని ఏఏపీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వా పేర్కొన్నాడు.
చదవండిఅంతరం తగ్గించినా...  ఆసీస్‌దే పైచేయి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top