ప్రొ కబడ్డీ లీగ్‌ ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం | Hyderabad Will Host The Pro Kabaddi League 2024 Play Offs And Final, Check Details Inside - Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ లీగ్‌ ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం

Published Fri, Feb 2 2024 3:42 AM

Hyderabad will host the Pro Kabaddi League play offs and final - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదో సీజన్‌ ప్లే ఆఫ్స్, ఫైనల్‌ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్‌ నిర్వాహకులైన మషాల్‌ స్పోర్ట్స్‌ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

టాప్‌–2 జట్లకు నేరుగా సెమీఫైనల్‌ బెర్త్‌లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్‌–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్‌–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి.

ఫిబ్రవరి 28న ఎలిమినేటర్‌–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్‌ ‘టాపర్‌’తో... ఎలిమినేటర్‌–2 విజేత లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్‌ మార్చి 1న జరుగుతుంది.   
 

Advertisement
 
Advertisement
 
Advertisement