Hundred League 2022: హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసిన బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌

Hundred League 2022: Moeen Ali Shines As Birmingham Phoenix Beat Trent Rockets - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌ 2022లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. సోమవారం ట్రెంట్‌ రాకెట్స్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రెంట్‌ రాకెట్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బర్మింగ్‌హామ్‌ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

కెప్టెన్‌ మొయిన్‌ అలీ ఆల్‌రౌండ్‌ షోతో (1/3; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు), లివింగ్‌స్టోన్‌ (32 బంతుల్లో 51 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో బర్మింగ్‌హామ్‌ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. బర్మింగ్‌హామ్‌ కోల్పోయిన 3 వికెట్లు లూక్‌ వుడ్‌ ఖాతాలో చేరాయి. 

అంతకుముందు డేనియల్‌ సామ్స్‌ (25 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో ట్రెంట్‌ రాకెట్స్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ జట్టులోని భారీ హిట్టర్లు అలెక్స్‌ హేల్స్‌ (1), డేవిడ్‌ మలాన్‌ (9), మన్రో (11) దారుణంగా నిరాశపరిచారు. బర్మింగ్‌హామ్‌ బౌలర్‌ హోవెల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

ఈ విజయంతో బర్మింగ్‌హామ్‌ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ప్రస్తుత ఎడిషన్‌లో తొలి ఓటమి చవిచూసిన ట్రెంట్‌ రాకెట్స్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన లండన్‌ స్పిరిట్‌ ఈ జాబితాలో టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఓవల్‌ ఇన్విన్సిబుల్‌ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆతర్వాతి స్థానంలో నిలిచింది. నార్త్రన్‌ సూపర్‌ చార్జర్స్‌ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), సథరన్‌ బ్రేవ్‌ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు), వెల్ష్‌ ఫైర్‌ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. 
చదవండి: ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ విధ్వంసం.. ఫాస్టెస్‌ సెంచరీ రికార్డు బద్దలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top