ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేలకోట్లు! ప్రభుత్వానికి చెల్లించేది ఎంతంటే! | How Much Tax Did BCCI Pay In FY 2021 22 Gigantic Number Will Shock You | Sakshi
Sakshi News home page

BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేలకోట్లు! ప్రభుత్వానికి చెల్లించేది ఎంతంటే!

Aug 9 2023 11:35 AM | Updated on Aug 9 2023 11:55 AM

How Much Tax Did BCCI Pay In FY 2021 22 Gigantic Number Will Shock You - Sakshi

BCCI's Income Tax: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్‌ బోర్డుగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రసిద్ది పొందింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నుంచి అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జాబితాలోనూ అగ్రస్థానంలో ఉంది. క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలుతూ మీడియా హక్కులు, స్పాన్సర్లతో భారీ ఒప్పందాలు తదితర కార్యకలాపాలతో దండిగా సంపాదిస్తోంది బీసీసీఐ. 

ఐసీసీ నుంచి అత్యధికంగా
ఇక 2024-27 కాలానికి గానూ ఐసీసీ నుంచి.. బీసీసీఐ తమ వాటాగా ఏడాదికి 230 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు(సుమారు రెండు వేల కోట్లు) పొందనున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ఇటీవలే వెల్లడించారు. మరి వేల కోట్ల సంపాదనతో రిచెస్ట్‌ బోర్డుగా ఘనతకెక్కిన బీసీసీఐ ప్రభుత్వానికి ఎంత మేర పన్ను చెల్లిస్తుందో తెలుసా?!

వేలకోట్ల ఆదాయం
అక్షరాలా పదకొండు వందల నూట యాభై తొమ్మిది కోట్లు! 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ ఈ మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు.  అదే విధంగా.. గత ఐదేళ్లలో బీసీసీఐ చెల్లించిన టాక్స్‌ వివరాలను సభలో వినిపించారు.

ఇక 2017-18లో 596.63 కోట్లు, 2019-20లో 882.29 కోట్లు, 2020-21లో 844.92 కోట్లు పన్ను చెల్లించినట్లు తెలిపారు. 2021-22లో బీసీసీఐ ఆదాయం 7,606 కోట్ల రూపాయలుగా ఉందన్న మంత్రి.. ఖర్చుల రూపంలో 3064 కరిగిపోయినట్లు వెల్లడించారు. 

ప్రధాన వనరు అదే!
అదే విధంగా.. 2020-21 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో 4735 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా.. 3080 వ్యయమైనట్లు బీసీసీఐ తెలిపిందని పేర్కొన్నారు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? 
మా కెప్టెన్‌ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement