కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న.. 6.4 లక్షలకు..! | Host Amitabh Bachchan Asks Test Cricket Question For 6.4 Lakhs To Contestant In Popular Quiz Show KBC, Post Viral | Sakshi
Sakshi News home page

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న.. 6.4 లక్షలకు..!

Oct 30 2024 9:00 AM | Updated on Oct 30 2024 10:57 AM

Host Amitabh Bachchan Asks Test Cricket Question For 6.4 Lakhs To Contestant In Popular Quiz Show KBC

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేసే ప్రముఖ టెలివిజన్‌ షో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. దాదాపు ప్రతి ఎపిసోడ్‌లో ప్రతి కంటెస్టెంట్‌కు ఇలాంటి ఓ ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా జరిగిన కేబీసీ 16వ సీజన్‌ 57వ ఎపిసోడ్‌లో (అక్టోబర్‌ 29న టెలికాస్ట్‌ అయ్యింది) మరోసారి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది.

రూ. 6. 4 లక్షలు విలువ చేసే ఈ ప్రశ్న టెస్ట్‌ క్రికెట్‌కు సంబంధించింది. 2022లో టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజే 500కు పైగా పరుగులు స్కోర్‌ చేసిన తొలి జట్టు ఏది..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు కరెక్ట్‌ సమాధానం ఇంగ్లండ్‌. 2022 డిసెంబర్‌ 1న పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి రోజే 506 పరుగులు (4 వికెట్ల నష్టానికి) చేసింది. టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజే 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టు ఇంగ్లండే.

ఈ ప్రశ్నను ఎదుర్కొన్న కంటెస్టెంట్‌కు క్రికెట్‌ పరిజ్ఞానం బాగా ఉన్నట్లుంది. అందుకే అతను పూర్తి వివరాలతో సహా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్‌ 500కు పైగా స్కోర్‌ చేసిన మ్యాచ్‌లో తొలి రోజే నలుగురు బ్యాటర్లు (జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, హ్యారీ బ్రూక్‌) సెంచరీలు చేశారని వివరణ ఇచ్చాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement