ఫోర్లతో హర్మన్‌ హల్‌చల్‌.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఫిఫ్టీ | Harmanpreet Kaur Registers 1st Half Century In WPL 2023 MIW Vs GGW | Sakshi
Sakshi News home page

WPL 2023: ఫోర్లతో హర్మన్‌ హల్‌చల్‌.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఫిఫ్టీ

Mar 4 2023 9:16 PM | Updated on Mar 4 2023 9:37 PM

Harmanpreet Kaur Registers 1st Half Century In WPL 2023 MIW Vs GGW - Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)లో తొలి అర్థశతకం నమోదైంది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ లీగ్‌లో తొలి ఫిఫ్టీ సాధించింది. గుజరాత్‌ జెయిం‍ట్స్‌తో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ 22 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకుంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వేగంగా ఆడిన హర్మన్‌ వరుస బౌండరీలతో విరుచుకుపడింది.

బౌండరీల రూపంలోనే 44 పరుగులు వచ్చాయంటే ఆమె ఎంత దూకుడుగా ఆడిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక హర్మన్‌ ఇన్నింగ్స్‌ ఒక్క సిక్సర్‌ లేకుండా కేవలం బౌండరీలు మాత్రమే ఉండడం విశేషం.

మ్మ్యాచ్‌ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు అమెలియా కెర్‌(24 బంతుల్లో 45 నాటౌట్‌) మెరుపులు మెరిపించింది. గుజరాత్‌ బౌలర్లలో స్నేహ్‌ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్‌, అష్లే గార్డనర్‌, జార్జియా వెర్‌హమ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement