ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా | Grandmaster R Praggnanandhaa was awarded Rs. 50 lakh by the Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా

Jun 9 2026 5:56 AM | Updated on Jun 9 2026 5:56 AM

Grandmaster R Praggnanandhaa was awarded Rs. 50 lakh by the Tamil Nadu

సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్‌ చెస్‌ టోర్నిలో టైటిల్‌ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్‌ సత్కరించారు. 

తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్‌ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్‌ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్‌ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్‌ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్‌ను ఛాంబర్‌లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్‌ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్‌లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement