Norway Open Chess Tournament
-
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్‌ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్‌ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్‌లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
సీఎం విజయ్‌తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ని ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే గాక అతడితో సరదాగా చెస్ ఆడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద ఫైనల్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను మట్టికరిపించి చాంపియన్‌షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన ప్రజ్ఞానంద చివరి దశలో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో విన్సెంట్ కీమర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అభినందించారు.#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX— ANI (@ANI) June 8, 2026చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్! -
చరిత్ర సృష్టించిన వైశాలీ.. తమ్ముడి బాటలోనే అక్క!!
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద బాటలోనే సోదరి ఆర్ వైశాలీ నడిచింది. జపాన్ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్ వుమెన్స్ చెస్ టూర్ టైటిల్‌ను వైశాలీ సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగిన ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో వైశాలీ తొలి స్థానంలో నిలవగా, అలెంగ్జాడ్రా కొస్తేనుక్ (రష్యా), ఆంటోనెటా స్టిఫనోవా (బల్గేరియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 24 ఏళ్ల వైశాలీ శనివారం తన ఫైనల్ రౌండ్లో కజకిస్తాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ అలువా నూర్మన్‌తో తలపడింది. రెండు గేముల పోరులో 1.5-0.5 తేడాతో చిత్తు చేసింది. అంతకముందు మాజీ చాంపియన్ కోస్టేనియుక్ను కూడా ఇదే తేడాతో ఓడించిన వైశాలీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో వైశాలీ ఒక గేమ్ గెలిచి మరొక గేమ్‌ను డ్రా చేసుకుంది. ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలిచిన వైశాలీ నేటి నుంచి ప్రారంభం కానున్న బ్లిట్జ్ చెస్ ఈవెంట్‌ను కూడా గెలిచి డబుల్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో పాల్గొన్న ఇతర క్రీడాకారిణులు అన్నా సర్గ్స్యాన్, ఐరిన్ సుకందర్, అలువా నూర్మాన్,అజుమి సకాయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.అయితే వైశాలీ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు ఆర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.చదవండి: కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! -
నార్వే ఓపెన్ చెస్ విజేత ప్రజ్ఞానంద
ఓస్లో: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా అవతరించాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద 18 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో రౌండ్లో ప్రజ్ఞానంద రెగ్యులర్ గేమ్‌లో 45 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలిచాడు. టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ గేమ్‌లో గెలిచినందుకు ప్రజ్ఞానందకు మూడు పాయింట్లు లభించాయి. మరోవైపు వెస్లీ సో (అమెరికా)–అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) రెగ్యులర్ గేమ్ ‘డ్రా’ అయింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్ గేమ్‌లో వెస్లీ సో 37 ఎత్తుల్లో అలీరెజాను ఓడించాడు. 17 పాయింట్లతో వెస్లీ సో రన్నరప్ గా నిలువగా... 15.5 పాయింట్లతో అలీరెజా మూడో స్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్ 13 పాయింట్లతో కార్ల్సన్ నాలుగో స్థానం పొందాడు. 11 పాయింట్లతో కీమెర్ ఐదో స్థానంలో, ప్రపంచ చాంపియన్ గుకేశ్ 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. -
వరల్డ్ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ 2026లో మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ చెస్‌లో వరుసగా రెండోసారి ఓడించి చావుదెబ్బ కొట్టాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజ్ఞానందకు కార్ల్‌సన్‌పై తాజా విజయం ఆ ప్రయత్నాలకు ఊతమిచ్చినట్లయింది. అంతేకాదు నార్వే చెస్ టోర్నీలో కార్ల్‌సన్‌ను అతడి సొంతగడ్డపైనే రెండుసార్లు మట్టికరిపించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది క్లాసికల్ చెస్ గేమ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి ఆటగాడు కూడా ప్రజ్ఞానందనే కావడం విశేషం. మంగళవారం రాత్రి జరిగిన ఎనిమిదో రౌండ్లో ప్రజ్ఞానంద నల్లపావులతో బరిలోకి దిగాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న కార్ల్సన్ ఆశలకు ప్రజ్ఞానంద గండికొట్టినట్లయింది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తి కావడం, మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలిఉండడంతో కార్ల్సన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కష్టమే. గేమ్‌లో ప్రజ్ఞానంద విజయం ఖాయమైన తర్వాత కార్ల్సన్ మొహం మాడిపోయింది. ఓటమి బాధలో కనీసం ప్రజ్ఞానందకు అభినందనలు కూడా తెలియజేయకుండా అక్కడి నుంచి నిరాశతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టాండింగ్స్ విషయానికొస్తే.. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో తన రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కైమర్‌ను టై-బ్రేక్‌లో ఓడించి 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఓటమితో 8 పాయింట్లు మాత్రమే కలిగిన అతడు క్లాసికల్ చెస్ టోర్నీ టైటిల్ సాధించే అవకాశం కోల్పోయాడు. మిగిలిన రెండు గేములు గెలిచినా గుకేశ్ 14 పాయింట్ల వద్దే ఆగిపోనున్నాడు.Check out the incredible final moments of Praggnanandhaa taking down World no.1 Magnus Carlsen with the Black pieces in Round 8 of Norway Chess 2026!With this win, Pragg becomes the first Indian (and possibly in the world) player who defeated Magnus Carlsen in Classical Chess… pic.twitter.com/MFvJPdBHel— ChessBase India (@ChessbaseIndia) June 2, 2026చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడర్స్‌తో క్రికెటర్ల బంధం! -
కరువానాపై అర్జున్ విజయం
స్టావెంజర్: నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ జోరుకు బ్రేక్ పడగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయంతో టైటిల్ రేసులోకి వచ్చాడు. ఎనిమిదో రౌండ్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల గుకేశ్ 50 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ అర్జున్ 71 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. క్లాసికల్ గేమ్‌లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్‌లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్‌లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. ఎనిమిదో రౌండ్ ముగిశాక కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 పాయింట్లతో కార్ల్సన్ రెండో స్థానంలో, 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 10.5 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో, వె యి (చైనా) 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో ఉన్నారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 13.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హంపి 58 ఎత్తుల్లో సారా ఖాదెమ్ (స్పెయిన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి 37 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్పై సంచలన విజయం సాధించింది. -
అర్జున్‌పై తొలిసారి నెగ్గిన గుకేశ్
స్టావెంజర్: గత ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ పాల్గొన్న పలు టోర్నీలలో ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అయితే నార్వే ఓపెన్ టోర్నీలో గుకేశ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతోన్న ఈ టోర్నీలో... గుకేశ్ ఆరో రౌండ్లో నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి గెలిచాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన ఉత్సాహంలో గుకేశ్ క్లాసికల్ ఫార్మాట్లో మరో ప్రత్యర్థిపై తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. ఆ ప్రత్యర్థి ఎవరో కాదు భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్. గతంలో అర్జున్‌తో పోటీపడిన ఆరుసార్లు గుకేశ్‌కు విజయం దక్కలేదు. ఒక గేమ్‌లో ఓడిపోయి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో ప్రయత్నంలో మాత్రం గుకేశ్ పైచేయి సాధించాడు. మూడున్నర గంటలకుపైగా జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడుతూ 92 ఎత్తుల్లో అర్జున్ను ఓడించాడు. ఈ విజయంతో గుకేశ్ 11.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. 12.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) అగ్రస్థానంలో... 11 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ మూడో స్థానంలో ఉన్నారు. హికారు నకమురా (అమెరికా; 8.5 పాయింట్లు) నాలుగో స్థానంలో, అర్జున్ (7.5 పాయింట్లు) ఐదో స్థానంలో, వె యి (చైనా; 6.5 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. -
నార్వే చెస్ టోర్నీ విజేతగా కార్ల్సన్..
నార్వే చెస్ టోర్నీ-2024 ఛాంపియన్‌గా వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్ రౌండ్లో ఫాబియానో కారువానాపై కార్ల్సన్ విజయం సాధించాడు. తొలుత వీరిద్దిరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆర్మగెడాన్ ప్లేఆఫ్‌లో ఫాబియానో కరువానాను కార్ల్సన్ ఓడించాడు. మరొక ఆర్మగెడాన్ పోటీలో హికారు నకమురాను భారత గ్రాండ్‌మాస్టర్ ప్రగ్నానంద రమేష్‌బాబు.. హికారు నకమురాను ఓడించడంతో కార్ల్సెన్ విజయం లాంఛనమైంది.నకమురా ఓటమి పాలవ్వడంతో కార్ల్సెన్ స్టాండింగ్‌లో తన ఆధిక్యాన్ని నిలుపునకుని ఛాంపియన్‌గా అవతరించాడు. కార్ల్‌సన్‌కు ఆర్మగెడాన్ ఫార్మాట్ ఇది ఐదో విజయం కావడం విశేషం. ఇక ఈ టోర్నీలో కార్ల్సన్(17.5) తొలి స్ధానం సంపాదించగా.. నకమురా(15.5), ప్రగ్నానంద(14.5) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో జు వెన్షున్(చైనా) విజేతగా నిలిచింది. 🐐🐐🐐 @MagnusCarlsen pic.twitter.com/MUH73HWmNG— Chess.com (@chesscom) June 7, 2024 Magnus Carlsen beats Fabiano Caruana in Armageddon to earn at least a playoff for the #NorwayChess title! https://t.co/vj9WZbbkJq pic.twitter.com/fdWy4evo1K— chess24 (@chess24com) June 7, 2024 -
వైశాలి విజయం... హంపి పరాజయం
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి తన జోరు కొనసాగిస్తోంది. నాలుగో రౌండ్ గేమ్‌లో వైశాలి 54 ఎత్తుల్లో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత వైశాలి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత నంబర్‌వన్ కోనేరు హంపి 55 ఎత్తుల్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నాలుగో రౌండ్లో 65 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌కు షాక్
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై ఊహించని విజయం నమోదు చేశాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్‌సన్‌పై ఇదే తొలి విజయం. Magnus Carlsen resigns!@rpraggnachess overtakes Fabiano Caruana and jumps into sole first!https://t.co/wJtLtsYIDS#NorwayChess pic.twitter.com/6DGZDqQbrG— chess24 (@chess24com) May 29, 2024మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సన్ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు. -
Norway chess: ఆనంద్‌కు మరో విజయం
స్టావెంగర్: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన క్లాసికల్ విభాగం రెండో రౌండ్లో ఆనంద్ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్ తొపలోవ్‌పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్ కార్ల్‌సన్‌ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్ డెత్’లో వెస్లీకి విజయం లభించింది. -
ఆనంద్ రెండో రౌండ్ గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు మూడో విజయం
స్టావెంజర్ (నార్వే) : భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మూ డో విజయాన్ని సాధించాడు. జాన్ లుడ్విగ్ హామర్ (నార్వే)తో బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆనంద్ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గురువారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆనంద్ తలపడతాడు. -
ఆనంద్‌కు ఐదో ‘డ్రా’
స్టావెంజర్ (నార్వే): విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. అరోనియన్ (ఆర్మేనియా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. కామన్వెల్త్ చెస్‌లో హంపి, లలిత్‌ల శుభారంభం న్యూఢిల్లీ: కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏపీ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ఎం.ఆర్. లలిత్‌బాబు శుభారంభం చేశారు. తొలి రౌండ్లో హంపి ... సోహమ్పై, లలిత్‌బాబు... ఓజస్ కులకర్ణిపై గెలిచారు.


