నార్వే ఓపెన్‌ చెస్‌ విజేత ప్రజ్ఞానంద | Praggnanandhaa wins Norway Open chess tournament | Sakshi
Sakshi News home page

నార్వే ఓపెన్‌ చెస్‌ విజేత ప్రజ్ఞానంద

Jun 6 2026 3:44 AM | Updated on Jun 6 2026 3:44 AM

Praggnanandhaa wins Norway Open chess tournament

ఓస్లో: భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద నార్వే ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజేతగా అవతరించాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద 18 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో రౌండ్‌లో ప్రజ్ఞానంద రెగ్యులర్‌ గేమ్‌లో 45 ఎత్తుల్లో విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ)పై గెలిచాడు. టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ గేమ్‌లో గెలిచినందుకు ప్రజ్ఞానందకు మూడు పాయింట్లు లభించాయి. 

మరోవైపు వెస్లీ సో (అమెరికా)–అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌) రెగ్యులర్‌ గేమ్‌ ‘డ్రా’ అయింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్‌ గేమ్‌లో వెస్లీ సో 37 ఎత్తుల్లో అలీరెజాను ఓడించాడు. 17 పాయింట్లతో వెస్లీ సో రన్నరప్‌ గా నిలువగా... 15.5 పాయింట్లతో అలీరెజా మూడో స్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ 13 పాయింట్లతో కార్ల్‌సన్‌ నాలుగో స్థానం పొందాడు. 11 పాయింట్లతో కీమెర్‌ ఐదో స్థానంలో, ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement