ప్రతాప్‌ సింగ్‌కు స్వర్ణం  | Gold for Pratap Singh | Sakshi
Sakshi News home page

ప్రతాప్‌ సింగ్‌కు స్వర్ణం 

Feb 23 2023 3:31 AM | Updated on Feb 23 2023 3:31 AM

Gold for Pratap Singh - Sakshi

కైరో (ఈజిప్ట్‌): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్‌ సింగ్‌ 16–6తో అలెగ్జాండర్‌ షిమిర్ల్‌ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు.

ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో షిమిర్ల్, ప్రతాప్‌ సింగ్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌ చేరారు. భారత్‌కే చెందిన అఖిల్‌ షెరాన్‌ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ రెండో ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్, ఇషా సింగ్‌ క్వాలిఫయింగ్‌లో వరుసగా 32వ, 34వ స్థానాల్లో నిలిచారు.  

Advertisement
 
Advertisement
Advertisement