కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో గిల్‌  | Gill at career best rank | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో గిల్‌ 

Sep 14 2023 1:55 AM | Updated on Sep 14 2023 1:55 AM

Gill at career best rank - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగేళ్ల తర్వాత టాప్‌–10లో ముగ్గురు భారత బ్యాటర్లకు చోటు దక్కింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌ 759 రేటింగ్‌ పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్టార్స్‌ విరాట్‌ కోహ్లి 715 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 707 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. 2019లో రోహిత్, కోహ్లి, శిఖర్‌ ధావన్‌ టాప్‌–10 ర్యాంకింగ్స్‌లో నిలిచారు.

పాకిస్తాన్‌ కెపె్టన్‌ బాబర్‌ ఆజమ్‌ 863 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాక్‌ నుంచి కూడా ముగ్గురు టాప్‌–10లో ఉండటం విశేషం. ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ 735 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో, ఫఖర్‌ జమాన్‌ 705 పాయింట్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఏడో ర్యాంక్‌లో, మొహమ్మద్‌ సిరాజ్‌ తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement