పీవీ సింధుకు ఘోర పరాభవం..  | German Open 2022: PV Sindhu Crashes Out After Shocking Defeat In Second Round | Sakshi
Sakshi News home page

German Open 2022: పీవీ సింధుకు ఘోర పరాభవం.. రెండో రౌండ్‌లోనే ఇంటి ముఖం

Mar 10 2022 5:49 PM | Updated on Mar 10 2022 7:41 PM

German Open 2022: PV Sindhu Crashes Out After Shocking Defeat In Second Round - Sakshi

జర్మన్‌ ఓపెన్‌ 2022లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఘోర పరాభావం ఎదురైంది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత అయిన సింధు సూపర్‌ 300 టోర్నీ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. తనకంటే తక్కువ ర్యాంక్‌ క్రీడాకారిణి అయిన జాంగ్‌ ఈ మాన్‌ (చైనా) చేతిలో 14-21 21-15 14-21తో సింధు ఓటమిపాలైంది. 

ఈ గేమ్‌ తొలి సెట్‌ కోల్పోయిన సింధు రెండో సెట్‌లో పుంజుకుని విజయం సాధించినప్పటికీ.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ప్రత్యర్ధికి తలవంచింది. దీంతో వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్షిప్స్‌కు ముందు ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌, లక్ష్యసేన్‌లు తొలి రౌండ్‌లో ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. శ్రీకాంత్‌.. ఫ్రాన్స్‌ షట్లర్‌ బ్రిస్‌ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించగా, మహిళల సింగిల్స్‌లో నెహ్వాల్‌.. క్లారా అజుర్మెండిపై 21-15, 17-21, 21-14తో, లక్ష్యసేన్‌..  వాంగ్‌ చారోయెన్‌పై 21-6, 22-20 తేడాతో విజయం సాధించారు. 
చదవండి: Gautam Gambhir: రోహిత్‌ శర్మ కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాను.. !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement