‘బుమ్రాను ఎలా వాడాలో తెలియని కెప్టెన్సీ ఇది’

Gambhir Hit Out At Virat Kohli For His Usage Of Jasprit Bumrah - Sakshi

న్యూఢిల్లీ: ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరాజయం చెందడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఈ వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లి వైఫల్యం పూర్తిగా కనబడిందని మండిపడ్డాడు. ప్రధానంగా టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చేత బౌలింగ్‌ చేయించిన విధానాన్ని గంభీర్‌ తప్పుబట్టాడు. తొలి స్పెల్‌లో బుమ్రాకు రెండు ఓవర్లు ఇవ్వడం పూర్‌ కెప్టెన్సీకి నిదర్శమన్నాడు. బుమ్రా తన మొదటి స్పెల్‌లో ఏడు పరుగులిచ్చిన క్రమంలో అతని చేత కంటిన్యూగా బౌలింగ్‌ ఎందుకు చేయించలేదని ప్రశ్నించాడు. ఆసీస్‌ వంటి పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన జట్టుపై ఆడేటప్పుడు వికెట్లు తీసే ఒత్తిడి పెంచాలని, ఈ మ్యాచ్‌లో కోహ్లి వికెట్లు సాధించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనబడలేదన్నాడు.  ఈసీపీఎన్‌ క్రిక్‌ఇన్పోతో గంభీర్‌ మాట్లాడుతూ..   ‘ఆసీస్‌ ఎటువంటి బ్యాటింగ్‌ లైనప్‌తో అందరికీ తెలుసు. మరి అప్పుడు బౌలింగ్‌ ప్రణాళికలు చాలా పకడ్భందీగా ఉండాలి. (అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి: వీడియో వైరల్‌)

ఒక ప్రధాన బౌలర్‌కు తొలి స్పెల్‌లో రెండు ఓవర్లే ఇస్తారా..సాధారణంగా వన్డే గేమ్‌లో మూడు స్పెల్‌లు ఉంటాయి. తొలి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేయిస్తే, మిగతా రెండు స్పెల్‌ల్లో మూడేసి ఓవర్లు చొప్పున వేస్తారు. కనీసం బుమ్రా చేత తొలి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేయించాల్సింది. బుమ్రా బౌలింగ్‌ ఆడటానికి ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఆదిలో కాస్త తడబడ్డారు. టువంటప్పుడు అతని బౌలింగ్‌ సరిగా ఉపయోగించుకోలేదనేది సుస్పష్టం.  ఒక ప్రీమియర్‌ బౌలర్‌ను ఆరంభంలో రెండు ఓవర్లకే పరిమితం చేస్తే అప్పుడు ఏమనాలి. ఇటువంటి కెప్టెన్సీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈ తరహా కెప్టెన్సీ గురించి కూడా ఏమీ వివరించలేను కూడా. ఇది టీ20 క్రికెట్‌ కాదునే విషయం కోహ్లి తెలుసుకోవాలి. ఇది పూర్‌ కెప్టెన్సీ అని కచ్చితంగా చెప్పగలను’ అని విమర్శించాడు. 

నిన్నటి మ్యాచ్‌లో బుమ్రా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌, నాలుగో ఓవర్‌ వేసిన తర్వాత అతనికి తొమ్మిదో ఓవర్‌ వరకూ మళ్లీ బౌలింగ్‌ చేయలేదు. అంటే అతని తొలి స్పెల్‌ను రెండు ఓవర్లకే పరిమితం చేశాడు కోహ్లి. రెండో ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వని బుమ్రా.. నాల్గో ఓవర్‌లో లెగ్‌ బైతో కలుపుకుని ఎనిమిది పరుగులిచ్చాడు.ఆపై ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్‌ను వేసిన బుమ్రా రెండు పరుగులే ఇచ్చాడు. ఈ విషయాన్నే టార్గెట్‌ చేస్తూ మాట్లాడాడు గంభీర్‌. (కెప్టెన్‌గా కోహ్లి చేసిన ఆ తప్పిదాలతోనే..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top