టోక్యో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్‌ జట్టు ప్రకటన

Full list of Indian shooters selected For Tokyo Olympics - Sakshi

ఇలవేనిల్‌కు అవకాశం

మూడు విభాగాల్లో మనూ భాకర్‌ పోటీ

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్‌ జట్టును నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్‌లు సంపాదించారు. అయితే ఎన్‌ఆర్‌ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్‌ అనేది దేశానికి చెందుతుందికానీ అర్హత సాధించిన షూటర్‌కు కాదు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందకపోయినా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, తమిళనాడు షూటర్‌ ఇలవేనిల్‌ వలారివన్‌కు టోక్యోలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఎన్‌ఆర్‌ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. ఇక 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో టోక్యో బెర్త్‌ సాధిం చిన చింకీ యాదవ్‌ను కాదని మనూ భాకర్‌కు అవకాశం ఇచ్చారు. చింకీని రిజర్వ్‌గా ఎంపిక చేశారు.     

పురుషుల విభాగం: 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌: దివ్యాంశ్, దీపక్‌. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌: సంజీవ్‌ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌: సౌరభ్‌ చౌధరీ, అభిషేక్‌ వర్మ. స్కీట్‌ ఈవెంట్‌: అంగద్‌వీర్, మేరాజ్‌ అహ్మద్‌ఖాన్‌.  

మహిళల విభాగం: 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌: అపూర్వీ, ఇలవేనిల్‌. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌: అంజుమ్, తేజస్విని. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌: మనూ భాకర్, యశస్విని. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌: రాహీ, మనూ. 10 మీటర్ల రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌: దివ్యాంశ్, ఇలవేనిల్‌. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌: సౌరభ్, మనూ భాకర్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top