New Zealand Cricket: న్యూజిలాండ్‌ మాజీ ఓపెనర్‌ కన్నుమూత

Former New Zealand batter Bruce Murray passes away at 82 - Sakshi

న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెల్లింగ్టన్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. 1969లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్‌ తమ మొట్టమొదటి టెస్టు విజయంలో ముర్రే కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను 90 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

1968లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముర్రే.. న్యూజిలాండ్‌ తరపున 13 టెస్టులు ఆడారు. ఈ 13 మ్యాచ్‌ల్లో 29.9 సగటుతో 598 పరుగులు సాధించాడు. అతడు కెరీర్‌లో 5 హాఫ్‌సెంచరీలు కూడా ఉన్నాయి.

అదే విధంగా ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో వెల్లింగ్టన్‌ తరపున 102 మ్యాచ్‌లు ఆడిన ముర్రే 6257 పరుగులు సాధించాడు. ఇక బ్రూస్ ముర్రే మనవరాళ్లు అమేలియా కెర్, జెస్‌ కెర్‌  ప్రస్తుతం న్యూజిలాండ్‌ మహిళ జట్టులో కీలక సభ్యలుగా ఉన్నారు.
చదవండిలంకతో తొలి వన్డే.. సూపర్‌ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top